అమెరికాలో( America ) అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు .మన ఆచార వ్యవహారాలు,సంస్కృతీ, సంప్రదాయాలు, ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇందులో పలువురు విదేశీయులు సైతం పాల్గొనడం గమనార్హం.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ఇండియన్స్ అధిక సంఖ్యలో గుమిగూడారు. ఈ జంక్షన్‌లోని బిల్‌బోర్డుపై రాముడి ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు.
ప్రవాస భారతీయులు సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతపట్టి రామ నామ స్మరణ చేస్తూ సందడి చేస్తున్నారు. యూఎస్ లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది.మసాచుసెట్స్‌లోని వొర్సెస్టర్ నగర మేయర్ జో పెట్టీ అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ అమెరికా విభాగంతో పాటు ప్రవాస భారతీయ సంఘాలు , హిందూ ధార్మిక సంస్థలు ఈ కార్యక్రమాల బాధ్యతను తీసుకున్నాయి.