ఓటీటీలో అత్యధిక వ్యూయర్‌షిప్‌తో నంబర్ వన్ గా సలార్….

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సలార్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.హిందీ మినహా మిగిలిన ప్రధాన భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న సలార్‌ చిత్రం మేనియా ఇండియాలో కూడా కొనసాగుతోంది.

 

నెట్‌ఫ్లిక్స్ ఇండియా చార్ట్స్‌లో సలార్‌ పార్టు 1 అత్యధిక వ్యూయర్‌షిప్‌తో టాప్ వన్ ప్లేస్ లో నిలిచింది. తెలుగు, తమిళ్‌ వెర్షన్స్‌ సెకండ్ ప్లేస్ లో నిలువగా.. కన్నడ, మలయాళ వెర్షన్లు 5 వ ప్లేసులో, 7th ప్లేస్ లో నిలిచింది.

ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటించింది. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరి కుమారి , శ్రీయ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు.రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news