దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా పెరుగుతుంది గాని తగ్గే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడట౦ లేదు ప్రస్తుతం. దేశంలో కరోనా వ్యాప్తికి కేంద్రం చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే కరోనా మాత్రం పెద్దగా ఆగే అవకాశాలు కనపడటం లేదు. అయితే ఇక్కడ కరోనా విషయంలో ఒక సంచలన నిజం బయటకు వచ్చింది. అసలు అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే…
దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల్లో సగానికి పైగా కరోనా లక్షణాలు ఉండటం లేదు. కరోనా లక్షణాలు లేకుండా పరిక్షలు చేసిన తర్వాత కరోనా కేసులు బయటపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి అని కేంద్రం చెప్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఇదే విషయం చెప్పారు.
దేశంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే లక్షణాలు లేకుండా కరోనా బయటపడటం అనేది నిజంగా భయపెట్టే అంశం. ఇదే విధంగా పరిస్థితి ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో అది తీవ్రంగా ఉండే సూచనలు ఉంటాయి. కాబట్టి ప్రజలు ఇప్పటి నుంచే జాగ్రత్త పడటం మంచిది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా దేశంలో కరోనా కేసులు 3 లక్షల దిశగా వెళ్తున్న సంగతి తెలిసిందే.