బంగారం మళ్ళీ పెరిగింది…!

-

గత రెండు రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఒక్కసారిగా మళ్ళీ పెరిగింది. కొన్ని రోజులుగా కరోనా ప్రభావం తో బంగారం ధరలు తగ్గు ముఖం పడుతున్నాయి. డిమాండ్ తగ్గుతున్న నేపధ్యంలో బంగారం దిగుమతులు కూడా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా బంగారానికి డిమాండ్ తగ్గింది. కరోనా ప్రభావంతో మన దేశంలో కొనుగోళ్ళు భారీగా తగ్గాయి.

ఇక గురువారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.670 పెరుగుదలతో రూ.42,970కు చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.690 పెరగడంతో రూ.39,390కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బంగారం ధర పెరిగింది. 700 వరకు ఈ ధర పెరగడం గమనార్హం.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరగడంతో… రూ.40,250కు చేరుకుంది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే… కూడా రూ.700 పెరగడంతో రూ.41,450కు చేరుకుంది. ఇక కేజీ వెండి కూడా స్వల్పంగా పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news