వైరల్ వీడియో.. చైన్‌స్మోకర్‌ ఈ కుక్క.. పెట్టెలకొద్ది సిగరెట్లు తాగుతున్న కుక్క

-

రూపాలు వేరు అయినా సరే మనుషులకు కుక్కలకు కాస్త దగ్గరి పోలికలు ఉంటాయని కొందరు అంటూ ఉంటారు. కోతికి మనిషికి ఉన్నట్టే కుక్కకు మనిషికి ఉన్నాయని అంటారు. వాస్తవంగా కొన్ని కొన్ని కుక్కలను చూస్తే అదే విషయం అర్ధమవుతుంది. అవి తమ బాధలను చెప్పే సమయం, ప్రేమను చూపించే సమయం, మనుషుల కోసం తపించే తత్వం ఇవన్ని కూడా మనిషిని పోలే ఉంటాయి.

ఒకరకంగా చెప్పాలంటే విశ్వాసంలో మనిషికంటే కుక్కే వెయ్యి రెట్లు నయం అనేది కూడా అందరికి తెలిసిందే. ఇప్పుడు ఒక కుక్క విషయానికి వచ్చి చూద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక కుక్క వీడియో చూస్తే, ఎన్నో ఏళ్ళ నుంచి సిగరెట్ అలవాటు ఉన్న వ్యక్తి కూడా తాగని రేంజ్ లో ఆ కుక్క సిగరెట్ తాగడం చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. బాధలో ఉన్నట్టు ఉన్న తన హావభావాలు,

కాలితో సిగరెట్ కాల్చి, ముక్కులో నుంచి పొగ వదులుతున్న విధానం చూసి చైన్ స్మోకర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వాట్సాప్ స్టేటస్ లు గా పెట్టారు కొందరు. ఇక వీడియో వెనుక ఒక తెలుగు పాటను జోడించారు కొందరు. దానికి ఎం బాధలు ఉన్నాయో…? ప్రేమించిన ఆడ కుక్క వదిలేసింది ఏమో అంటూ కామెంట్లు చేస్తూ కుక్క వీడియో ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా వీడియో చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news