అమావాస్యరోజు అమ్మవారి దేవాలయంలో చండీదీపారధన చేయండి ఈరాశులకు శుభం! ఏప్రిల్ 5 రాశిఫలాలు

మేషరాశి : అనుకూల ఫలితాలు, లాభాలు, పనులు పూర్తి, విందులు.
పరిహారాలు : ఇష్టదేవతరాధన చేయండి. అమావాస్య దీపారాధన చేయండి.

వృషభరాశి : కార్యలాభం, కొత్త వ్యక్తుల పరిచయం, శత్రువుల వల్ల భయం, నూతనోత్సాహం.
పరిహారాలు : అమావాస్య కాబట్టి నేడు అన్నదానం చేయండి.

మిథునరాశి :  ప్రతికూల ఫలితాలు, పనుల్లో జాప్యం, సంతానం వల్ల ఇబ్బందులు, ప్రయాణంలో ఇబ్బందులు.
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో చండీదీపారాధన చేయండి మేలు జరుగుతుంది.

05th Aril 2019 Friday Horoscope
05th Aril 2019 Friday Horoscope

కర్కాటకరాశి : వ్యతిరేక ఫలితాలు, కుటుంబంలో ఇబ్బందులు, పనుల్లో ప్రతికూలం. అలసట.
పరిహారాలు- అమ్మవారికి అష్టోతర పూజ, చండీదీపారాధన చేయండి మేలు జరుగుతుంది.

సింహరాశి : అనుకూలం, ఆకస్మిక లాభం, పనులు పూర్తి, అధికారులతో చిన్నచిన్న ఇబ్బందులు అయినా అధిగమిస్తారు.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామికి అష్టోతర పూజ/అమ్మవారికి అర్చన చేయండి.

కన్యారాశి :  సౌఖ్యం, అనుకూల వాతావరణం, పనులు పూర్తి, ఇంట్లో ఆనందం
పరిహారాలు- ఇష్టదేవతరాధన, గోసేవ చేసుకోండి.

తులారాశి : అలసట, స్నేహితుల వల్ల లాభం, కార్యజయం, పనులు పూర్తి, వ్యాపారులకు అనుకూలం.
పరిహారాలు- అమ్మవారికి తెల్ల పూలతో అర్చన, దీపారాధన చేయండి.

వృశ్చికరాశి : దేవాలయ దర్శనం, అలసట, సంతోషం, కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు- దుర్గాదేవికి అష్టోతర పూజ/పారాయణం లేదా దేవాలయ ప్రదక్షణలు చేయండి.

ధనస్సురాశి : సేవకుల వల్ల నష్టం, ఆకస్మిక ప్రయాణం. అలసట, కార్యనష్టం.
పరిహారాలు- అమావాస్య రోజు అంటే శుక్రవారం అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయండి.

మకరరాశి :  ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు, కళత్ర లాభం, దేవాలయ దర్శన సూచన, మిత్రలాభం.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామికి అర్చన/పూలమాల సమర్పణ చేయండి.

కుంభరాశి : అనుకూలం, సోదర సహకారం, విందులు, పనులు పూర్తి. కార్యలాభం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, గోసేవ చేయండి మంచిది.

మీనరాశి : అనవసర ఖర్చు, కార్యజయం, అలసట, ఆకస్మికలాభం, పనులు పూర్తి, విందులు.
పరిహారాలు- అమావాస్య దీపం అమ్మవారి దేవాలయంలో ప్రదోష కాలంలో లేదా ప్రాతః కాలంలో పెట్టండి మేలు జరుగుతుంది.

-కేశవ