శ్రీ వికారినామ సంవత్సరం మిథున రాశిఫలాలు
మృగశిర- 3,4పాదాలు, ఆర్ద్ర- 1, 2,3,4 పాదాలు, పునర్వసు- 1, 2, 3 పాదాలు.
ఆదాయం– 11 వ్యయం-2
రాజపూజ్యం-5, అవమానం-2
ఈ రాశివారికి గురు ప్రభావం వల్ల స్వలాభం వీడి ఇతరులకు ఉపకరించే విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. సామాజిక సంబంధాలు వృద్ధి చెందుతాయి. శని సంవత్సరాది నుంచి జనవరి 24 వరకు ధనస్సులో సప్తమస్థానంలో ఉంటాడు. దీనివల్ల అదృష్టం వరించే సమయం. గృహనిర్మాణ యోగం ఉంది. రాహు,కేతువల ప్రభావం తెలియని అనారోగ్యం, నీరసం ఉంటాయి. ఆరోగ్యాన్ని బట్టి ఆహారనియమాలు పాటించడం మంచిది.
మొత్తంగా ఈరాశి గ్రహ పరిశీలనలో సామాన్యంగా ఉన్నది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. కోర్టు, విదేశీ వ్యవహారాలు పరిష్కారమవుతాయి. చేసేపనిలో నిర్లిప్తత ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టుట వలన సంవత్సరాంతమున లాభాన్ని పొందుతారు. వ్యవసాయదారులకు నల్లని, పసుపు పంటల వల్ల ధనాదాయం వస్తుంది. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ రంగం వారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్ రంగంలో వున్నవారికి శుభప్రదంగా ఉంటుంది. సినీ, కళాకారులకు విశేషంగా ఉంటుంది. డాక్టర్లు,ఇంజినీర్లు, లాయర్లకు తృప్తి ఉంటుంది. స్త్రీలకు ఆదాయవృద్ధి పెరుగుతుంది. ఈ సంవత్సరం లక్ష్మీదేవి పూజలు, హోమాలు, శ్రీసూక్త పారాయణం/శ్రవణం మంచి చేస్తుంది.
చైత్రమాసంలో ముఖ్యమెన గ్రహాల సంచారము అనానుకూలంగా ఉంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. వ్యాపారంలో, స్వయంవృత్తిలో ఉన్నవారు దీర్ఘకాలిక పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. వైశాఖ మాసంలో అనవసరమైన ప్రయాణాల మూలంగా అనారోగ్యము. వృధా ఖర్చులు, ప్రారంభించిన పనులలో సహనము చాలా అవసరము. నిబద్ధతతో, శ్రద్ధతో పనులు చేస్తూ ముందుకు సాగాలి. జ్యేష్టమాసంలో వాహనముల మూలంగా ఇబ్బందులు. ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారు, యంత్రములతో, పనివారితో చాకచక్యంగా ఉండడం మంచిది.
ఆషాఢంలోనూ గ్రహస్థితి అనా-నుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. శ్రావణమాసంలో ప్రారంభించిన పనులు, నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశా-లున్నాయి. మంచి వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు పొందుతారు. తద్వారా పదిమందిలో మంచిపేరును సంపాదిస్తారు. పనులు లాభదాయకంగా ఉంటాయి. భాద్రపదంలో మిశ్రమ వాతావరణం. మాసాంతంలో అనారోగ్య సూచన. ఆశ్వీయుజ మాసంలో పనులను ప్రారంభించేముందు ప్రణాళిక ప్రయత్నాలు అవస-రము. గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. కనుక ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులలో నష్టము. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడము. అనవసరమైన ఖర్చులు. కుటుంబం-లోని వ్యక్తుల మధ్య అవగాహన లేకపోవడం. అనవ-సరమైన విమర్శలు, నిందలను ఎదుర్కొనుట.
ఆర్థిక-పరమెన సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించ-డానికి ఖర్చులను నియంత్రించుకోవడం, ఓపికతో పనులు చేయడం అత్యంత అవసరం. కార్తీక మాసాంతంలో కొంత ప్రయోజనం చేకూరుతుంది. పనులలో సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మార్గశిర మాసంలో అనవసరమెన ప్రయాణాలు. శ్రమాధిక-మైనా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తయ్యేటట్లుగా ప్రణాళికలు వేసుకోవాలి. పౌష్య మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉండడంతో అనవసరమైన శారీరక శ్రమ, మానసిక ఇబ్బందులు ఉంటాయి. ఆవేశాలకు దూరంగా ఉంటూ, పనులను చేసుకుంటూ వెళ్లడం మంచిది. మాఘ మాసంలో మొదటి రెండు వార-ములలో పరిస్థితి యథావిధిగా ఉన్నా మాసం చివ-రిలో కొంత అనుకూలత ఉంటుంది. మంచి ఫలితా-లను పొందుతారు. ఫాల్గుణ మాసంలో ముఖ్యమైన గ్రహాల అనుకూల స్థితి వలన ప్రారంభించిన పనులు అనుకొన్న సమయంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. నలుగురిలో మంచి పేరును పొందు-తారు.
– కేశవ