జనవరి 12 శనివారం- రోజువారి రాశిఫలాలు

మారేడుదళాలతో వేంకటేశ్వర స్వామికి పూజచేస్తే ఈ రాశికి మంచిది!

12th january 2019 saturday horoscopes

మేషరాశి: మిత్రులతో వినోదాలు, అనవసర వివాదాలు, విచారం, కుటుంబంలో సంతోషం. మంచి ఫలితాల కోసం నవగ్రహ ప్రదక్షణ లేదా ఆంజనేయస్వామి దేవాలయ దర్శన చేయండి.

వృషభరాశి: ఆనందం, ఆదాయంలో వఋద్ధి, స్త్రీసుఖం, విందులు వినోదాలు, దేవాలయ సందర్శన సూచన. మంచి ఫలితాల కోసం ఈశ్వర ఆరాధన చేయాలి.

మిధునరాశి: పనుల వల్ల లాభం, అధికారుల వల్ల లాభం, మానసిక ఆందోళన. దేవాలయ సందర్శన లేదా గోసేవ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కర్కాటకరాశి: ఆనందం, పెద్దవారి పరిచయాలు, విందులు వినోదాలు, ఖర్చు ఎక్కువ అవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మంచి ఫలితం కోసం నవగ్రహ ప్రదక్షణ చేయండి. సింధూరం ధరించండి.

సింహరాశి: కార్యజయం, ధననష్టం, చికాకు, విందులు, వినోదాలు. మంచి ఫలితాల కోసం వేంకటేశ్వరస్వామి ఆరాధనను మారేడు దళాలతో చేయండి. ఊర్దపుండ్రం ధరించండి.

కన్యారాశి: మిత్రులతో విందులు, దేవాలయ సందర్శన, పనులు కొనసాగుతాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అధిగమిస్తారు. గురుగ్రహానికి కందులు, శనికి నువ్వులు నైవేద్యం పెట్టండి. వీలైతే పేదలకు సహాయం చేయండి.

తులరాశి: దేవాలయ దర్శన సూచన, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. పనుల్లో వేగం. మరింత మంచి ఫలితాల కోసం ఆంజనేయస్వామి/సుబ్రమణ్య ఆరాధన మంచిది.

వృశ్చికరాశి: అధికారులతో ఇబ్బందులు, దేవాలయ దర్శన సూచన, మిత్రులతో కాలయాపన చేస్తారు. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేసుకోండి.

ధనస్సురాశి: కార్యజయం, చికాకు, మిత్రులతో విందులు, పనులు నెమ్మదిగా పూర్తి. మంచి ఫలితాల కోసం శివపూజ/అభిషేకం చేయండి.

మకరరాశి: శారీరక శ్రమ, విందులు, వినోదాలు, వ్యాపార లాభం. పరిహారాలు వేంకటేశ్వర ఆరాధన మారేడుదళాలతో చేయండి.

కుంభరాశి: అధికారుల వల్ల ఉపయోగం, కుటుంబ సౌఖ్యం, విందులు, వినోదాలు. మంచి ఫలితాల కోసం శనివార నియమం పాటించండి.

మీనరాశి: ఆనందం, దేవాలయ సందర్శన, కీర్తినష్టం, అధికార లాభం. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధన, సింధూర ధారణ చేయండి. వీలైతే పేదలకు వస్త్రదానం చేయండి.

-కేశవ