ఆయన పేరే బాలాజీ హాసన్. ఆయనది తమిళనాడు. ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండియా సెమీస్‌లోనే ఇంటి దారి పడుతుందన్నాడు. నిజంగానే ఇంటి దారి పట్టింది. సెమీస్‌లో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీస్‌లోకి వెళ్తాయన్నాడు. వెళ్లాయి. కానీ.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం ఆ జ్యోతిష్యుడి అంచనా తప్పయింది. తలకిందులైంది. ఆయన గెలుస్తాదన్న జట్టు న్యూజిలాండ్ ఫైనల్‌లో ఓడిపోయింది. ఇంగ్లండ్ గెలిచింది. ఆయన చెప్పిన లెక్కలన్నీ సరిగ్గా కుదిరాయి కానీ.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం న్యూజిలాండ్ గెలవలేదు.
ఆయన పేరే బాలాజీ హాసన్. ఆయనది తమిళనాడు. ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను హీరో మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతకీ ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడాడో తెలుసా? 2019 ప్రపంచకప్‌లో ఏ జట్టు గెలుస్తుందని యాంకర్ ప్రశ్నించడంతో.. ఇది చాలా కష్టమైన ప్రశ్న అని అన్న బాలాజీ హాసన్.. ఇప్పటి వరకు గెలవని జట్టే ఈసారి వరల్డ్ కప్ సాధిస్తుందని చెప్పాడు. ఈసారి టైటిల్‌ను న్యూజిలాండ్ గెలుస్తుందని.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కేన్ విలియమ్సన్‌ను వరిస్తుందన్నాడు.
ఫైనల్ లో ఆ జ్యోతిష్యుడి అంచనా తప్పినా.. సెమీ ఫైనల్ వరకు ఆయన చెప్పినట్టే జరిగింది. దీంతో ఆయన మాట్లాడిన వీడియో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఆయన చెప్పినవి చెప్పినట్టు సెమీ ఫైనల్ వరకు జరిగి.. పైనల్ లోనే ఎందుకు అలా జరిగింది.. అనేది మాత్రం అంతుపట్టడం లేదు. అయితే.. ఆ జ్యోతిష్యుడు చెప్పిన దాని ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ ఒక్కటే బోల్తా కొట్టింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ జ్యోతిష్యుడు చెప్పినట్టే విలియమ్సన్ కే దక్కింది. అంటే లెక్క తప్పింది ఒక ఫైనల్ మ్యాచ్ గెలుపు పైనే.
అయితే.. ఈయన కేవలం అంచనా మాత్రమే వేశాడు కదా. సెమీస్ వరకు ఆయన అంచనాలు ఫలించాయి. ఫైనల్ మ్యాచ్ లో ఆయన అంచనాలు ఫలించలేదు అని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
మరికొందరు క్రిటిక్స్ మరో వాదనను కూడా తెరపైకి తీసుకొచ్చారు. నిజానికి.. న్యూజిలాండే ఈ మ్యాచ్ లో విన్నయింది. సూపర్ ఓవర్ కంటే ముందు చివరి ఓవర్ లో ఓవర్ త్రో పడటం వల్ల అదనంగా నాలుగు పరుగులు ఇంగ్లండ్ కు వచ్చాయి. దాని వల్ల మ్యాచ్ టై అయింది. లేకపోతే న్యూజిలాండ్ గెలిచేదే కదా. అంటే.. నైతికంగా న్యూజిలాండే ఈ ప్రపంచ కప్ విజేత.. అంటూ చెబుతున్నారు. అంటే ఆయన చెప్పిందే జరిగింది అంటూ ఈ కొత్త వాదనకు తెర లేపుతున్నారు.
This guy, Balaji Hasaan had predicted this in January 2019.
Semifinalists : India, Australia, England & New Zealand ( Done)
New Zealand would win Semi Final against India ( Done)@BLACKCAPS will win the World Cup ( ???)@KaneWilliamson will be Player of the Series (???)
#CWC19 pic.twitter.com/PJ6zortLX5— Mohammed Zubair (@zoo_bear) July 11, 2019