జూన్ 17 రాశి ఫ‌లాలు: శివునికి పంచదార కలిపిన ఆవుపాలతో అభిషేకం చేయండి!

-

సోమవారం- జూన్ 17 రోజువారి రాశిఫలాలు

మేషరాశి: సేవకుల వల్ల లాభం, వాహన లాభం, అన్నింటా జయం, ఇంట్లో మార్పులు. ప్రయాణ సూచన.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, పేదలకు సహాయం చేస్తే సరిపోతుంది.

వృషభరాశి: బంధువులతో వివాదాలు, స్నేహితుల వల్ల లాభం, ఇంట్లో సమస్యలు, అశుభకార్యసూచన, ప్రయాణాలు వాయిదా, ఆరోగ్యంలో మార్పులు.
పరిహారాలు: శివునికి పంచదార కలిపిన ఆవుపాలతో అభిషేకం చేయించండి మంచిది.

మిథునరాశి: ప్రయాణాలందు ఇబ్బందులు, ఆదాయానికి మించిన ఖర్చులు, అనవసర ప్రయాణాలు, పనులు వాయిదా, ఆరోగ్య ఇబ్బందులు.
పరిహారాలు: శివునికి పంచదార కలిపిన ఆవుపాలతో అభిషేకం చేయించండి తప్పక మంచి ఫలితం వస్తుంది.

కర్కాటకరాశి: మిత్రులతో విందులు, సకల కార్యజయం, ఇంట్లో ఎక్కువ సమయం గడపండి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి, ప్రయాణాలు తప్పనిసరి కాకుంటే వాయిదా వేసుకోండి.
పరిహారాలు: శివుని ఆరాధన, అభిషేకం మంచి చేస్తుంది.

సింహరాశి: కుటుంబ సంతోషం, ప్రశాంతత, లాభం, వ్యవహార లాభం, పనులు వాయిదా, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక ఇబ్బందులు,
పరిహారాలు: శివునికి అభిషేకం లేదా 11 ప్రదక్షణలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.

కన్యారాశి: శ్రమ అధికం, వ్యసనాలు, అనవసర ఖర్చులు, వ్యాపారనష్టం, ప్రయాణాలు కలసిరావు, అనవసర తిరుగుడు.
పరిహారాలు: శివాలయంలో ప్రదక్షణలు, తెల్ల పూలతో పూజ మంచి చేస్తుంది.

తులారాశి: ప్రయాణం, కుటంబ ఆనందం, దేవాలయ దర్శన సూచన, బంధువుల రాక, ప్రయాణాలు కలసివస్తాయి, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ మంచి చేస్తుంది.

వృశ్చికరాశి: ఆందోళన, కాలక్షేపం, మిత్రులతో లాభం, భయం అధికం, అన్నింటా జయం,
పరిహారాలు: శివునికి పూజ. ప్రదక్షణలు మంచి చేస్తాయి,

ధనస్సురాశి: మానసిక ఆందోళన, కుటుంబ సుఖం, ప్రశాంతత, వ్యవహార లాభం,ప్రయాణాఉల కలసివస్తాయి.
పరిహారాలు: శివునికి తెల్లని పూలతో అర్చన చేయండి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది.

మకరరాశి: నూతన వస్త్రప్రాప్తి, స్త్రీమూలక ధనలాభం, పనుల్లో జయం, ఆనందం. ఇష్టమైన వారిని కలుస్తారు, మిత్రులతో లాభం.
పరిహారాలు: శివనామస్మరణ, ప్రదక్షణలు మంచి ఫలితాన్నిస్తాయి.

కుంభరాశి: వివాదాలు, భక్తి అధికం, కొత్తపనులు ప్రారంభం, ప్రశాంతత ఉండదు, ప్రయాణ సూచన, మిత్రుల కలయిక.
పరిహారాలు: శివునికి అభిషేకం, తెల్లనిపూల అర్చన మంచిది.

మీనరాశి: సకల కార్యజయం, స్వల్ప అనారోగ్య సూచన, ధనలాభం, ప్రయాణాలు, ఇంట్లో నూతన కార్య ప్రయత్నం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దీపారాధన చేస్తే చాలు మంచిది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news