లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఇలా చేయండి..!

-

ఇంట్లో కి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీ దేవికి నచ్చేట్టు ఉండాలట. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవీ ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది.

లక్ష్మీ అనుగ్రహం కావాలని అందిరికీ కోరిక. ధనం, ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మీ సంపదల కోసం అందరూ తాపత్రయం పడుతుంటారు. ఎంతో కష్టపడి పనిచేసినా ధనం నిల్వ ఉండని వారు కొందరు, ధనం వచ్చినా పలు సమస్యలతో నీటిలా ఖర్చు అయిపోతుందని మరికొందరు. ఎంత కష్టపడ్డా చాలీచాలనీ బతుకులు అని మరికొందరు… ఇలా లోకంలో పలు రకాల అలక్ష్మీ పుత్రులు. అయితే వీరంతా శాస్త్రం చెప్పిన విధివిధానాలను పాటిస్తే తప్పక లక్ష్మీ అనుగ్రహం కలుగడమే కాదు పదిమందడికి ఉపయోగపడే స్థాయికి చేరుకుంటారు. ఆ నియమాలు ఏమిటో చూద్దాం…

ఇంట్లో కి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీ దేవికి నచ్చేట్టు ఉండాలట. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవీ ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. ఇంతికీ గుమ్మం ముందు ఏమి ఉంటే లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఓసారి చూద్దాం..

– తప్పనిసరిగా ప్రాతఃకాలమందే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా శుభ్రంగా ఊడ్చుకొని వీలుంటే ఆవుపేడతో కళ్లాపి అంటే నీటిని చల్లుకుని చక్కటి ముగ్గును వేయాలి. వీలైతే పసుపు, కుంకుమ, రంగులతో అలంకరణగా వేసుకోవాలి. ఇది లక్ష్మీప్రదానికి సూచన. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి.

– లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటుఇటూ పెడితే.. అవి రోజూ మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేల కలువ పువ్వులు దొరకకపోయినా ఏదోఒక పువ్వులు పెడితే మంచిది.

* గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటె గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.

* గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని, దానిలో నీళ్ళు నింపి దానిలో 5 రూపాయల బిళ్ళలు, పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి. ఇలా చెయ్యడం ద్వారా దరిద్రం పోయి, సమస్యలు, అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది

– ప్రతి శుక్రవారం, గురువారం సాయంత్రం పూట గుగ్గిలం, సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది, దుష్ట శక్తుల నివారణకు, నెగెటివ్ ఫోర్స్‌లకు చెక్‌పెట్టి చక్కటి ప్రశాంతత, అష్టలక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.

– ఇంట్లో ప్రతి పండుగకు తప్పక దర్వాజలకు మామిడి ఆకు తోరణం, పూలమాలల తోరణాలు కట్టుకుంటే తప్పక ప్రకఋతి స్వరూపిణి అయిన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.

– ప్రతి శుక్రవారం గడపలకు, తులసీకోటకు పసుపుతో అలంకరణ, పూజ చేస్తే తప్పక సర్వభూత స్వరూపిణి అయిన దారిద్య్రనాశిని అనుగ్రహం కలుగుతుంది.

ఇక ఆలస్యమెందుకు పైన చెప్పిన నియమాలను, తంత్రాలను పాటించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి.

– ఓం శ్రీ మహా లక్ష్మైనమః

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news