హమ్మ‌య్య‌.. భార‌త్ ఆడింది.. పాక్ విజ‌య ల‌క్ష్యం 337..

-

భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య‌ జ‌రుగుతున్న వ‌న్డే ప్రపంచ క‌ప్ మ్యాచ్‌కు వ‌ర్షం అడ్డంకిగా నిలిచిన‌ప్ప‌టికీ కొంత సేప‌టికి ఎండ వ‌చ్చి మ్యాచ్ ఆరంభమైంది. దీంతో ఎలాంటి ఓవ‌ర్ల కోత లేకుండానే అంపైర్లు మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించారు. ఇక భార‌త్ ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 336 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. కాగా భార‌త బ్యాట్స్‌మెన్ల‌లో ఓపెనర్ రోహిత్ శర్మ 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు చేసి టీంకు చ‌క్క‌ని ఆరంభాన్ని ఇచ్చాడు. ఇక కెప్టెన్ కోహ్లి (77 పరుగులు, 7 ఫోర్లు), మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (57 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు కూడా రాణించ‌డంతో ఇండియా భారీ స్కోరు చేసింది.

కాగా పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్ 3 వికెట్లు తీయ‌గా, హసన్ అలీ, వహబ్ రియాజ్‌లు చెరొక వికెట్ తీశారు. అయితే భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణ‌యం అందరినీ షాక్‌కు గురి చేసింది. 48 ఓవ‌ర్‌ 4వ బంతి కింద పాక్ బౌల‌ర్‌ అమీర్ షార్ట్ పిచ్ డెలివ‌రీ వేశాడు. దాన్ని కోహ్లి పుల్ చేయ‌గా బంతి అత‌ని హెల్మెట్‌కు త‌గిలి వెన‌క్కి వెళ్ల‌డంతో దాన్ని స‌ర్ఫ‌రాజ్ క్యాచ్ ప‌ట్టాడు. అయితే అంపైర్ ఔట్ ప్ర‌క‌టించ‌లేదు. అయినా కోహ్లి తాను ఔట్ అయ్యానేమోన‌ని భావించి వెనుదిరిగాడు. కానీ బంతి బ్యాట్‌కు త‌గ‌ల్లేద‌ని త‌రువాత చూసిన అల్ట్రా ఎడ్జ్‌లో తేలింది. దీంతో అటు అభిమానులే కాదు, డ్రెస్సింగ్ రూంలో కూర్చున్న కోహ్లి కూడా ఆ సంఘ‌ట‌న‌కు ఖంగు తిన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news