ఏపీ మంత్రి అఖిల ప్రియకు మ‌రో షాక్‌..!

-

అందరికీ ఫోన్లు చేసి వలసలను ఆపాలని మంత్రి అఖిల ప్రియ చేసే ప్రయత్నాలేవి ఫలించడం లేదు. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియడం లేదట. ప్రస్తుతం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ అంతా ఖాళీ అయిపోయిందట.

వామ్మో.. ఇవేం రాజకీయాలు బాబోయ్. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా క్షణంక్షణం మారిన రాజకీయాలను చూసి ఉండరు. ఏపీలో మాత్రం క్షణం క్షణంకు రాజకీయాలు ఎక్కడికెక్కడికో వెళ్లిపోతున్నాయి. ఓవైపు రాజకీయ వేడి.. మరోవైపు ఎండాకాలం వేడి.. ఈరెండు ఏపీని వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్న సంగతి తెలిసిందే.

ap minister akhila priya uncle joins in ysrcp

పార్టీల దారులన్నీ వైసీపీ వైపే ఉన్నాయి. పార్టీల నేతలంతా వైసీపీ వైపే చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది ముఖ్య నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. లోటస్ పాండ్ మాత్రం ప్రతి రోజు వైసీపీలో చేరే నాయకులతో కిటకిటలాడుతోంది. వైఎస్ జగన్ కూడా ఊహించనంతగా… నాయకులు పార్టీలో వచ్చి చేరుతున్నారు.

తాజాగా ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియకు భారీ షాక్ తగిలింది. ఆమె సొంత మేనమామ, టీడీపీ నేత ఎస్వీ జగన్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. గత కొన్నిరోజులుగా ఆయన టీడీపీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన ఇవాళ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసిన ఎస్వీ.. ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈసందర్భంగా జగన్.. ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కర్నూలు జిల్లాలో వైసీపీలోకి జోరుగా చేరికలు

కర్నూలు జిల్లాలో వైసీపీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబంతో పాటు ఉన్న అనుచరులు, ఇతర బంధువులు కూడా వైసీపీ వైపే చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా టీడీపీ నుంచి నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కర్నూలు సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక కూడా ఇవాళ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి చాలా మంది నేతలు, తమ బంధువులు వైసీపీలో చేరుతుండటంతో ఏం చేయాలో తెలియక.. అందరికీ ఫోన్లు చేసి వలసలను ఆపాలని మంత్రి అఖిల ప్రియ చేసే ప్రయత్నాలేవి ఫలించడం లేదు. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియడం లేదట. ప్రస్తుతం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ అంతా ఖాళీ అయిపోయిందట. దీంతో కర్నూలు జిల్లా రాజకీయాలు కూడా రసవత్తరంగా మారాయి. వార్ వన్ సైడే అన్నట్టుగా తయారవుతున్నాయి. దీంతో టీడీపీ నేతల్లో గుబులు స్టార్ట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news