బిల్వదళాలతో వేంకటేశ్వరుని పూజిస్తే ఈ రాశివారికి జయం!
మేషరాశి- కుటుంబ సంతోషం, ధనలాభం, దేవాలయ సందర్శన సూచన, చిన్నచిన్నసమస్యలు. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.
వృషభ రాశి- బంధువుల రాక, సోదరుల సహకారం, పనుల్లో ఆటంకం. ఈశ్వరునిక అభిషేకం లేదా విష్ణు/వేంకటేశ్వరునికి మారేడు దళాలతో పూజ.
మిధునరాశి- చేసే పనిలో లాభం, వస్త్రలాభం, వ్యవహార జయం, బంధువుల రాక. పరిహారాలు వేంకటేశ్వర ఆరాధన చేయండి.
కర్కాటకరాశి- అధిక ధనలాభం, దూర ప్రయాణ సూచన, పనుల్లో జాప్యం. పరిహారాలు దేవి/అమ్మవారి ఆరాధన లేదా దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి.
సింహరాశి- శుభకార్యాలకు హాజరు, ధనవ్యయం, మిత్రులతో విరోధ సూచన. పరిహారాలు చండీదీపారాధన లేదా గణపతి ఆరాధన చేయండి.
కన్యారాశి- ప్రతికూల ఫలితాలు, అకారణ విరోధాలు, పనుల్లో జాప్యం. పరిహారాలు వేంకటేశ్వరస్వామికి మారేడు లేదా తులసి దళాలతో పూజ చేయండి. ఒక్క బిల్వం లేదా దళం స్వామి పటం ముందు ఉంచి నమస్కారం చేసుకుని పనులు ప్రారంభించండి.
తులరాశి-అధికార దర్శనం, సంతోషం, కొత్త స్త్రీల పరిచయం. ఇష్టదేవతారాధన చేసుకోండి.
వృశ్చికరాశి- అన్నింటా జయం, చేసే పనుల్లో ముందడుగు, ఆనందం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.
ధనస్సురాశి- మిత్రులతో ప్రయాణం, శుభకార్యాలకు హాజరు, ధనవ్యయం, పనుల్లో జాప్యం. పరిహారాలు అమ్మవారి కుంకుమ ధరించి పనులు ప్రారంభించండి.
మకరరాశి- కార్యభంగం, ప్రతికూల ఫలితాలు, అనవసర కలహాలు, ఆనారోగ్యం. పరిహారాలు చండీదీపారాధన లేదా ఆంజనేయదండకం చదువుకోండి.
కుంభరాశి- దేవాలయ దర్శన, బంధువుల రాక, కార్యలాభం, వ్యవహార జయం. పరిహారాలు అమ్మవారి స్తోత్ర పఠనం,వీలైతే దేవాలయ దర్శన చేయండి.
మీనరాశి- సంఘంలో గౌరవం, అధికార దర్శన, పనుల్లో జాప్యం, కుటుంబ సౌఖ్యం. పరిహారాలు సూర్యనమస్కారం, చాలీసా పఠనం.
-కేశవ