ఆంజనేయస్వామి పూజచేస్తే ఈ రాశులకు అంతా జయమే! మే 21 రాశి ఫలాలు

మే 21 మంగళవారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: పనిచేసే చోట అభివఋద్ధి, ఆందోళన, వ్యాపారనష్టం, కొత్త వ్యక్తుల పరిచయం. ఆరోగ్యం, పనులు నిదానంగా పూర్తి, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షణలు చేయండి.

వృషభరాశి: మిశ్రమ ఫలితాలు, అనవసర ఖర్చులు, ప్రభుత్వ మూలక ధనం, పనులు పూర్తి, ఆరోగ్యం, కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు.
పరిహారాలు: ఆంజనేయాలయం దర్శనం, ప్రదక్షణలు చేయండి.

21 may 2019 tuesday rasi phalalu

మిథునరాశి: నూతన పరిచయాలు, అధిక ఖర్చులు, ఆనందం, విందులు, పెద్దవారి పరిచయం. ఆరోగ్యం. కుటుంబ సఖ్యత,
పరిహారాలు: ఇష్టదేవతారాధన, ఆంజనేయ ఆరాధన చేసుకోండి.

కర్కాటకరాశి: అన్నింటా ప్రతికూలం, ఆకస్మిక ప్రయాణం, బాకీలు వసూలు, ధనలాభం, ఆరోగ్యం. కుటుంబ సఖ్యత.
పరిహారాలు: ఆంజనేయస్వామి అర్చన, ప్రదక్షణలు మంచి చేస్తాయి.

సింహరాశి: ప్రభుత్వమూలక ధననష్టం, అధికార దర్శనం, ముఖ్య సమస్య ఏర్పడును, ఆరోగ్యం, ప్రయత్నకార్యాలు జాప్యం.
పరిహారాలు: ఆంజనేయస్వామికి సింధూర పూజ చేయించండి మేలు జరుగుతుంది.

కన్యారాశి: దేవాలయ దర్శనం, ధననష్టం, పనులు పూర్తికావు, మిత్రుల వల్ల ఇబ్బందులు, ఆరోగ్యంలో మార్పులు, ప్రయాణాలు కలసిరావు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం, ప్రదక్షణలు చేయండి.

తులారాశి: ఆదాయనష్టం, అధికారుల కలయిక, విందులు, మిత్రులతో సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాల వద్ద ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.

వృశ్చికరాశి: పెద్దవారితో సంప్రదింపులు, తండ్రితో వైరం, బంధువుల కలయిక, ఆరోగ్యం.ప్రయాణ సూచన, కుటుంబంలో ఇబ్బందులు.
పరిహారాలు: ఆంజనేయస్వామికి సింధూరంతో పూజచేయించండి.

ధనస్సురాశి: ప్రభుత్వ ధనలాభం, అధికార దర్శనం, ముఖ్య విషయాలపై చర్చ, ప్రయాణ సూచన, ఆరోగ్యం.
పరిహారాలు: మంగళవార నియమాన్ని అంటే ఉపవాసం ఒక్కపూట భోజనం వంటివి చేయండి.

మకరరాశి: బంధువుల కలయిక, అశుభ సూచన, భార్యతో విరోధం, ఆరోగ్యం. ప్రయాణాలు, విందులు.
పరిహారాలు: ఆంజనేయస్వామి అభిషేకం, పూజ చేయండి.

కుంభరాశి: అన్నింటా అనుకూలం, కార్యలాభం, విందులు, ఆరోగ్యం, ప్రయాణాలు కలసివస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

మీనరాశి: ధనలాభం, భార్యకు ఆరోగ్య ఇబ్బందులు, మిత్రులతో కార్యజయం, ఆరోగ్యం, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, ఆంజనేయస్వామి దేవాలయ దర్శనం చేయండి.

-కేశవ