ఓటేసిన పోలింగ్ బ్యూటీ.. ఫోటోలు వైరల్

స్టార్ హీరోయిన్లను కూడా తలదన్నేలా ఉన్న ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఎల్లో శారీ కట్టుకొని.. పోలింగ్ సామాగ్రి తీసుకొని వెళ్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగించింది ఆ అధికారిణి.

పోలింగ్ బ్యూటీ ఎవరు.. ఇప్పుడే కొత్తగా వింటున్నాం అంటారా? ఆమధ్య ఎన్నికల సామాగ్రి తీసుకొని వెళ్తుంటే ఓ జర్నలిస్టు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. ఆ ఫోటో వైరల్ అయింది కదా. ఆమె పేరే రీనా ద్వివేది. గుర్తొచ్చిందా ఇప్పుడు. ఆ ద్వివేది గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. అప్పుడు ఎన్నికల సామాగ్రి తీసుకెళ్తూ వైరల్ అయింది. ఇప్పుడు ఓటేసిన ఫోటోలు వైరలయ్యాయి.

స్టార్ హీరోయిన్లను కూడా తలదన్నేలా ఉన్న ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఎల్లో శారీ కట్టుకొని.. పోలింగ్ సామాగ్రి తీసుకొని వెళ్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగించింది ఆ అధికారిణి. ఆమె డ్యూటీ చేసిన పోలింగ్ బూత్‌లో వంద శాతం పోలింగ్ నమోదయిందంటే అర్థం చేసుకోవచ్చు.. ఆమెకు ఎంత ఫాలోయింగ్ ఉందో.

polling beauty Reena Dwivedi cast his vote in uttar pradesh

నిన్న జరిగిన చివరి విడుత ఎన్నికల్లో ద్వివేది.. తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాకు సమీపంలో ఉన్న పన్సర్షిలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఓటు వేసిన అనంతరం తన సిరా మార్కును చూపిస్తున్న ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

polling beauty Reena Dwivedi cast his vote in uttar pradesh