జూన్ 25 మంగళవారం రాశి ఫలాలు
మేషరాశి: వ్యతిరేక ఫలితాలు, మనోదుఃఖం, మాటపట్టింపులు, అనారోగ్యం, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి మంచి జరుగుతుంది.
వృషభరాశి: అధికారుల వల్ల ధనలాభం, కొత్త వ్యక్తుల పరిచయం, శత్రువులపై జయం, దేవాలయ దర్శనం. ప్రయాణ సూచన.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దీపారాధన చేస్తే చాలు.
మిథునరాశి: అనుకూలం, అన్నింటా విజయం, విందులు, కళత్ర సుఖం, ఆకస్మిక ధనలాభం, పనులు పూర్తి, కుటుంబ సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ చేయండి.
కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు, శయ్యాభోగం, అధికశ్రమ, అలసట, కుటుంబంలో స్వల్ప విభేదాలు, అనుకోని మార్పులు.
పరిహారాలు: నవగ్రహాలకు పూజ, ప్రదక్షణలు చేయండి.
సింహరాశి: వ్యతిరేక ఫలితాలు, ప్రతికూల వాతావరణం, పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి, అనవసర వివాదాలు.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర రంగురంగు పూలతో ప్రదక్షిణలు, దీపారాధనచేస్తే దోషప్రభావాలు తగ్గుతాయి.
కన్యారాశి: అనుకూల వాతావరణం, కార్యజయం, వృత్తిలో లాభం, కీర్తి, పనులు పూర్తి, ఆదాయం, ఆరోగ్యం.
పరిహారాలు: దైవనామస్మరణ చేయండి. మంచి జరగుతుంది.
తులారాశి: కార్యజయం, ఉద్యోగులకు ఆనందం, పనులు పూర్తి, భార్యతో విందులు, ప్రయాణాలు, కుటుంబ సఖ్యత
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేసుకోండి చాలు.
వృశ్చికరాశి: ఆకస్మిక ధననష్టం, వస్తునష్టం, ఆరోగ్యంలో మార్పులు, కుటుంబంలో అనందం, విందులు, ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర ప్రదక్షిణలు, దీపారాధన చేసుకోండి.
ధనస్సురాశి: సేవకుల వల్ల కీర్తి, అన్నింటా జయం, పనులు పూర్తి, ఆర్థికంగా బాగుంటుంది, ఇష్టమైన వారిని కలసే అవకాశం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన అనుకూలం.
మకరరాశి: రక్త సంబంధీకులతో లాభం, అధిక ఖర్చులు, మిత్రుల లాభం, కుటుంబ సంతోషం, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ, స్తోత్రాలను చదువుకోండి.
కుంభరాశి: వ్యాపార ఆటంకం, అధిక ఖర్చులు, ప్రయాణాల్లో అలసట, అరోగ్యం సాధారణం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: నవగ్రహాలకు దీపారాధన, ప్రదక్షిణలు చేస్తే చాలు.
మీనరాశి: స్త్రీలతో కలహాలు, కుటుంబంలో చిక్కులు, విభేదాలు, అనవసర తిరుగుడు.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర రంగురంగు పూలతో ప్రదక్షిణలు చేస్తే దోషాల ప్రభావంతగ్గుతుంది.
– కేశవ