ఏపీ సచివాలయాన్ని తెలంగాణకు ఎలా ఇచ్చారు.. ప్రశ్నించిన పవన్

-

2014లో టీడీపీకి మద్దతు ఇచ్చాను. అందుకే నాపై బలమైన నైతిక బాధ్యత ఎక్కువుంది. అందుకే టీడీపీని ప్రశ్నించా. టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి చాలా సమయం తీసుకున్నా. సంవత్సరం దాకా టీడీపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు.. అని పవన్ అన్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ఓటమిని వదిలేసి మళ్లీ జనాల్లోకి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. జనసేన పార్టీ ముఖ్య కమిటీలను పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు.

అనంతరం పవన్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అనేది కొన్నిరోజులకు పరిమితమయ్యేది కాదు. దానికి సుదీర్ఘ పోరాటం ఉంది. దానికి సిద్ధమయ్యే పార్టీని ఏర్పాటు చేశా. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు. అసలు.. తెలంగాణ ప్రభుత్వానికి ఎలా ఇచ్చారు.. అనే దానికి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఇచ్చి తీరాలి. తెలుగు రాష్ర్టాల మధ్య సున్నితమైన అంశాలు చాలా ఉంటాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి.. అని పవన్ అన్నారు.

టీడీపీకి మద్దతు ఇచ్చా కాబట్టే నాపై నైతిక బాధ్యత ఎక్కువ ఉంది..

2014లో టీడీపీకి మద్దతు ఇచ్చాను. అందుకే నాపై బలమైన నైతిక బాధ్యత ఎక్కువుంది. అందుకే టీడీపీని ప్రశ్నించా. టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి చాలా సమయం తీసుకున్నా. సంవత్సరం దాకా టీడీపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే.. వాళ్లకు పాలన కోసం తగినంత సమయం ఇచ్చాం. కానీ.. ఆ తర్వాత టీడీపీని ప్రశ్నించడం మొదలు పెట్టా. వైఎస్సార్సీపీకి కూడా సమయం ఇస్తాం. కానీ.. ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలి. ప్రజలకు మేలు చేయకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే మాత్రం పోరాడటానికి మేం సిద్ధంగా ఉంటాం.. అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news