ఆవుపాలతో శివాభిషేకం చేస్తే ఈ రాశులకు కార్యజయం! మార్చి 25 రాశి ఫలాలు

-

మార్చి 25 సోమవారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: ప్రతికూలమైన రోజు, ధననష్టం, అశాంతి, విరోధాలు.
పరిహారాలు: పాలధారతో శివునికి అభిషేకం చేయండి దోషాలు పోతాయి.

వృషభరాశి: అనుకూల ఫలితాలు, చేసేపనిలో అనుకూలత, బాకీలు వసూలు, ముఖ్యమైన విషయాల గూర్చి వార్త వింటారు.
పరిహారాలు: ఆవుపాలతో శివాభిషేకం లేదా శివునికి మారేడు లేదా తుమ్మిపూలతో అష్టోతర పూజ చేయించుకోండి.

25 march 2019 monday rasi phalalu

మిథునరాశి: మిశ్రమఫలితాలు, శుభకార్యం వల్ల ఖర్చులు, దూరప్రయాణం, అధికశ్రమ.
పరిహారాలు: ఆవుపాలతో శివాభిషేకం, అష్టోతర పూజ మేలు చేస్తుంది.

కర్కాటకరాశి: అంతా మంచిగా ఉంటుంది. అందరితో అనుకూల వాతావరణం, పట్టుదల, విందులు, ప్రయాణ సూచన.
పరిహారాలు: ఆవుపాలతో శివాభిషేకం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి.

సింహరాశి: వ్యతిరేక ఫలితాలు, కుటుంబంలో ఇబ్బందులు, దుఃఖం, చెడువార్తా శ్రవణం.
పరిహారాలు: పాలతో శివునిక అభిషేకం లేదా తులసీ మాలతో విష్ణు ఆరాధన చెడు ఫలితాల తీవ్రత తగ్గిస్తుంది.

కన్యారాశి: బాగుంటుంది. కార్యజయం, దీర్ఘ ఆలోచనలు, చిన్నచిన్న సమస్యలు వచ్చినా అధిగమిస్తారు.
పరిహారాలు: శివాలయంలో ఆవునెయ్యితో దీపారాధన చేయండి.

తులారాశి: కార్యాలు పూర్తి, ఆనందం, సంతోషం, విందులు, వినోదాలు.
పరిహారాలు: శివపూజ/విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి: వ్యతిరేక ఫలితాలు, కార్యనష్టం, విరోధాలు, అలసట, ఇబ్బందులు.
పరిహారాలు: శివాభిషేకం, అష్టోతర పూజ చేసుకోండి వీలైతే గోసేవ కూడా చేసుకోండి మంచి జరుగుతుంది.

ధనస్సురాశి: వ్యతిరేక ఫలితాలు, చెడువార్తా శ్రవణం, బంధువుల రాక, దుఃఖం.
పరిహారాలు: శివాభిషేకం, మారేడుదళాలతో అష్టోతర పూజ చేయించుకోండి.

మకరరాశి: అంతా మంచిఫలితాలు, దుబారా, భార్యతో ప్రయాణాలు, విందులు, అరోగ్యం.
పరిహారాలు: ఆవుపాలతో శివునికి రుద్రాభిషేకం చేయండి మంచిది.

కుంభరాశి: అనుకూలమైన రోజు, కార్యజయం, పనులు పూర్తి, కుటుంబంలో సఖ్యత, విద్యార్థులకు అనుకూలం.
పరిహారాలు: ఆవుపాలతో శివునికి ఏకరుద్రాభిషేకం చేయించండి. వీలైతే ప్రదోషకాలంలో దీపారాధన మేలు చేస్తుంది.

మీనరాశి: ప్రతికూలం, ఇంట్లోవారికి అనారోగ్యం, ఆదాయానికి మించిన ఖర్చు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: శివునికి ఆవుపాలతో అభిషేకం, మారేడుదళాలతో అష్టోతర పూజ చేయండి మంచి జరుగుతుంది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news