లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్‌కు మరో అడ్డంకి.. సినిమా రిలీజ్ అయినట్టేనా?

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పూర్తిగా రాజకీయాలకు సంబంధించిన సినిమా. ఇది ఎన్నికల సమయం కావడం.. ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో నెగెటివ్‌గా చూపించారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అనుకున్నట్టుగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌కు మరో అవాంతరం వచ్చి పడింది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అని సినీ అభిమానులు టెన్షన్‌తో ఉన్న సమయంలో… సినిమా రిలీజ్‌కు మరో అవాంతరం ఎదురైంది. అది కూడా ఎన్నికల సంఘం నుంచి రావడంతో సినిమా విడుదలపై సినీ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

సినిమా నిర్మాతకు ఎన్నికల సంఘం నోటీసులు పంపించిందట. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత రాకేశ్ రెడ్డికి ఈసీ నుంచి నోటీసులు అందాయట. దీంతో రేపు అనగా సోమవారం ఉదయం రాకేశ్ రెడ్డి.. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ముందు హాజరవనున్నారట. ద్వివేదీకి సినిమా గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందట. అయితే.. గోపాలకృష్ణ ఆయన వివరణను ఓకే అంటే.. సినిమా రిలీజ్ అయినట్టే కానీ.. ఒకవేళ ఆయన సినిమా కథాంశంపై అనుమానం వ్యక్తం చేసే ఏపీలో సినిమా రిలీజ్ కానట్టేనని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పూర్తిగా రాజకీయాలకు సంబంధించిన సినిమా. ఇది ఎన్నికల సమయం కావడం.. ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో నెగెటివ్‌గా చూపించారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకోరకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ బయోపిక్. కాకపోతే లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందో ఆ విషయాలను డైరెక్టర్ వర్మ ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈనేపథ్యంలోనే ఈసీ సినిమా నిర్మాతకు నోటీసులు ఇచ్చిందా? లేక ఏపీలోని రాజకీయ శక్తులు కావాలని సినిమా విడుదలను ఆపడం కోసం చేస్తున్న కుట్రలా ఇవి? అనేది తెలియాలంటే సోమవారం దాకా ఆగాల్సిందే.

ఈ సినిమా విడుదలకు తెలంగాణలో క్లియరెన్స్ రావడం గమనార్హం. తెలంగాణ ఈసీ నుంచి సినిమా విడుదలకు ఇదివరకే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ.. ఏపీలో దీనికి బ్రేక్ పడింది.