ఫిబ్రవరి 15 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

ఫిబ్రవరి 15 – మాఘమాసం – సోమవారం.

 

మేష రాశి:పదోన్నతులు పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. ధన యోగం కలుగుతుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో  పదోన్నతులు పొందుతారు. గొప్పవారితో పరిచయాలను పెంచుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అనుకూలిస్తుంది. అధిక లాభాలు కలుగుతాయి. పురోహితులు వాక్చాతుర్యం వల్ల జనాదరణ పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు.

పరిహారాలుః ఈ రోజు విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

 వృషభ రాశి:మొండి బకాయిలను ఈరోజు వసూలు చేసుకుంటారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది.  ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. కార్యాలయాల్లో విశేష ఆదరణ పొందుతారు. గతంలో వసూలు కానీ కానీ మొండి బకాయిలను ఈరోజు వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది.  ఇంటిని కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 

 మిధున రాశి:ఉద్యోగ అవకాశం కలుగుతుంది !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు  పెట్టడానికి అనుకూల సమయం. లాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఏదో ఒక వేడుకలు జరుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందుతారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:మిత్ర లాభం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. అనారోగ్యాలను పోగొట్టుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రుల అవుతారు. మిత్ర లాభం కలుగుతుంది. శత్రు నాశనం. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. ధన లాభం కలుగుతుంది. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో  పై అధికారుల మన్ననలు పొందుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

 పరిహారాలుః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

 

సింహరాశి:పనులను సమయానికి పూర్తి చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. మీ మాట తీరు వల్ల వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. కోపానికి చిరాకులకు దూరంగా ఉంటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. కార్య లాభం కలుగుతుంది. సోదరులతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. పెద్ద వారి ఆదరణ పొందుతారు. ఆత్మీయ కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులవుతారు.

పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:అభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. సువర్ణ అభరణాలను కొనుగోలు చేస్తారు. ఎంత కష్టమైన పనినైనా  శ్రద్ధ పెట్టి చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలుః ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

తులారాశి:వ్యాపారాలు అధిక లాభాలు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు అధిక లాభాలు కలుగుతాయి. ధన లాభం కలుగుతుంది. రుణ బాధలు తీరిపోతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. వేదపండితులకు పురోహితులకు అనుకూలమైన శుభ యోగం కలుగుతుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 

వృశ్చిక రాశి:నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. శత్రువులు అంట మిమ్మల్ని క్షమాపణ కోరుతారు. రుణబాధలు తగ్గిపోతాయి. ధన యోగం కలుగుతుంది. గతంలో పోయినా ఉద్యోగాలు తిరిగి పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక ధనలాభం కలుగుతుంది. చేపట్టిన పనులను పట్టుదలతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.  ధర్మానికి ఆచారాలతో ప్రాధాన్యతనిస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. బ్రాహ్మణులు వేద పండితులు గొప్ప పేరుప్రఖ్యాతులు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు అన్నపూర్ణ దేవిని వారిని ఆరాధించండి.

 

 ధనస్సురాశి:ఈరోజు అదృష్ట యోగం ఉంటుంది !

ఈరోజు అదృష్ట యోగం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి బాగుంటుంది. అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. మీ మాట తీరు వల్ల అందరి ఆదరణ పొందుతారు.

పరిహారాలుః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

మకర రాశి:ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో ఆనందంగా, సఖ్యతగా ఉంటారు. వివాహ నిశ్చయ తాంబూలాలకు అనుకూలంగా ఉంటుంది. దంపతులు ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. అనారోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు.

పరిహారాలుః ఈరోజు సిద్ధి వినాయక స్వామిని ఆరాధించండి.

 

కుంభరాశి:వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోవడం వల్ల విద్య మీద అశ్రద్ధ చూపుతారు. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలము. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి.

పరిహారాలుః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:కార్యసిద్ధి కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి కలుగుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. సమస్యలు తీరుతాయి. యోగం కలుగుతుంది. ప్రశాంత కరమైన జీవనాన్ని గడుపుతారు. వ్యాపారాలను విస్తరించడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.

పరిహారాలుః ఈ రోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....