ఫిబ్రవరి 28 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.

 

మేష రాశి:వ్యాపారాల్లో లాభాలు !

ఈరాజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలు: ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:కార్యాలయాల్లో ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఖర్చులు ఎక్కువగా చేయడం వల్ల ధననష్టం కలుగుతుంది. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు మీద నిర్లక్ష్యం చూపుతారు. వ్యాపారాల్లో ఆర్ధిక నష్టం జరుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

పరిహారాలు: సూర్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:ధన లాభం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. వ్యాపారాలను విస్తరించుకుంటారు. ధన లాభం కలుగుతుంది.

పరిహారాలు: శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:ఈరోజు కష్టపడి చదువుకుంటారు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. చెప్పుడు మాటలకు దూరంగా ఉండడం వల్ల బాగుంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. విలువైన ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.

పరిహారాలు: శ్రీ భ్రమరాంబికాష్టకం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:ఒత్తిడి పెరుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల మీరు సహాయం చేసే వారు దూరమవుతారు. నూతన వ్యక్తుల పరిచయం అనర్థాలు కలిగిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.

పరిహారాలు: కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:వివాహ సంబంధ విషయాలు అనుకూలించవు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. వాహన ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. దూర ప్రయాణాలు  అనుకూలించవు. ఇతరులు చెప్పిన మాటలు వినడం వల మోసపోతారు. మిత్రుల వల్ల ద్రోహం జరుగుతుంది. రహస్యాలు బయటకు చెప్పడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వివాహ సంబంధ విషయాలు అనుకూలించవు. తక్కువ మాట్లాడడం మంచిది.

పరిహారాలు: ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

తులారాశి:శత్రువులు మిత్రులు అవుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. మిత్రుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి పొందుతారు. గృహంలో ఏదైనా ఒక శుభకార్యం తలపెడతారు.

పరిహారాలు: ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమాజంలో పేరుప్రఖ్యాతులు పొందుతారు.

పరిహారాలు: శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:అనారోగ్య సమస్యలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ధననష్టం కలుగుతుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఏ విషయంలో అయినా తల్లిదండ్రులతో చర్చించి ఆలోచన తీసుకోవడం వల్ల బాగుంటుంది. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

పరిహారాలు: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:మిత్రులు దూరం అవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. చేపట్టిన పనిని వాయిదా వేస్తారు. అనవసర ఖర్చులు చేయడం వల్ల ధన నష్టం ఏర్పడుతుంది. తొందరపాటు తనం వల్ల మీ ప్రాణ మిత్రులు దూరం అవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువును అశ్రద్ధ చేయడం వల్ల ఇబ్బందులు. తల్లిదండ్రుల మాటలు వినడం వల్ల బాగుంటుంది.

పరిహారాలు: ఈరోజు దుర్గా దేవిని ఆరాధించండి.

 

కుంభరాశి:తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో కష్టపడి అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కార్యసాధన పొందుతారు. ప్రయాణ లాభం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. గృహంలో శుభకార్యాన్ని జరుపుతారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వస్తువులను తిరిగి పొందుతారు.  నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం కలుగుతుంది. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలు: ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:ప్రయాణాలు జాగ్రత్త !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీ మాట తీరు బాగా లేకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. వాహన ప్రయాణాలు అజాగ్రత్తగా చేయడంవల్ల ప్రమాదాలు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది.

పరిహారాలు: శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news