మేషరాశి : పరిస్థితి అదుపులో ఉంచడానికి, ప్రతి ఒక్కరు మాట్లాడే సమస్య గురించి, ఒకసారి వినండీ. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. తెలివిగా మదుపు చెయ్యండి. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో ఆమె/అతను మీతో గొడవ పడతారు.
పరిహారాలు: ఓం ఆదిత్యాయనమః అనే మంత్రాన్ని 21 సార్లు పటించండి.
వృషభరాశి : మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లబ్ది కలిగే అవకాశం ఉంది. మీ తెలివితేటలు, ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు, కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. మీ భాగస్వామితో గడపం ఎంత గొప్ప అనుభూతో ఈ రోజు మీకు అనుభవంలోకి రానుంది.
పరిహారాలు: గోధుమ పిండి, బియ్యం, పాలు, పెరుగు, పంచదార ఒక పేద మహిళకు దానం చేయండి.
మిథునరాశి : సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుంచి అందే ఒక మంచి సలహా, మీకు మానసిక వత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే, దానికి ప్రమాదం తెస్తాయి. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిముషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ది ఒకటి కొనిస్తారు.
పరిహారాలు: పేదలకు వస్త్రదానం లేదా కప్పుకునే దుప్పటి కొత్తది దానం చేయండి.
కర్కాటకరాశి : క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల కన్పిస్తుంది. దీనివల్ల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. గుండెనిబ్బరం కోల్పోకండి. కనీస ఫలితం వచ్చేవరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానీయండి. దూరప్రాంతం నుండి, అనుకోని వార్త, కుటుంబమంతటికీ ఉద్వేగాన్ని కలిగించేది కావచ్చు. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
పరిహారాలు: శివునికి పంచామృత అభిషేకాన్ని చేయండి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది.
సింహరాశి : ఈ రోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్ ఆడాలి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల. దూరపు బంధువుల నుంచి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. ఈ రోజు, మీరు మీ మేధకు పదునుపెడతారు. భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షిణలు, ఉపవాసం మంచి ఫలితాన్నిస్తుంది.
కన్యారాశి : పిల్లలకు వారి హోమ్ అసైన్మెంట్ లో సహాయ పడడానికి ఇది సమయం. మీకు నచ్చినట్లుగా పిల్లలు ప్రవర్తించరు, మీకు చీకాకు తెప్పిస్తారు. అపరిమితమైన కోపం ప్రతి ఒక్కరిపైనా అందులోనూ కోప్పడిన వ్యక్తికి మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది, కనుక అదుపు చేసుకొండి. కమిషన్ల నుంచి డివిడెండ్లు లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.
పరిహారాలు: అమ్మ, అమ్మమ్మ లేదా ఇతర వృద్ధ మహిళల నుంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి దీవెనలు పొందండి.
తులారాశి : ఈరోజు ఇతరుల మాటమేరకు పెట్టుబడి మదుపు చేస్తే, ఆర్థిక నష్టాలు వచ్చేలాఉన్నాయి. కొద్దిపాటి వ్యాయంతో మీ రోజువారీ కార్యక్రమాలను మొదలుపెట్టండి. మీ గురించి మీరు హాయిగా అనిపించేలా పాటుపడడానికి, ఇదే సరియైన సమయం. ప్రేమ స్నేహం బంధం బలపడుతుంది. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు.
పరిహారాలు: యువతులు, ఉన్నత స్త్రీలను గౌరవించడం ద్వారా ఆర్థిక జీవితం బాగా మెరుగుపడుతుంది.
వృశ్చికరాశి : ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికిగాను, మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకొండి. పెద్దవారు, తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి, కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడుకావచ్చు.
పరిహారాలు: మంచి భవిష్యత్ కోసం వేంకటేశ్వర స్వామికి పసుపురంగు పూలమాల సమర్పించండి.
ధనస్సురాశి : మితిమీరిన అదనపు పనిని నెత్తికెత్తుకోకండి- కొంత విశ్రాంతిని తీసుకొండి. ఎప్పటిలా కాకుండా మీకే చాలా నీరసంగా అనిపిస్తుంది. ఆర్థికస్థితిగతులలో మందకొడి రావడం వలన కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది. మీ శ్రీమతితో మాట్లాడి, పెండింగ్లోగల ఇంటి పనులను ముగించడానికి ఏర్పాటు చేయండి. మీకు బాగా ఇష్టమైన వారినుండి కాల్ రావడంతో మీకు సంతోషంగా ఉండే రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రదక్షిణలు, దీపారాధన చేయండి.
మకరరాశి : మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. వినోదం, సరదాలు నిండే రోజు. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు. ఈ రోజు మీ మేధకు పదును పెడతారు. మీ శ్రీమతి చిన్న విషయాలకే తగువుకొస్తారు. దీన్ని నివారణకు ప్రయత్నించండి. ఇతరులు ఏమి చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు.
పరిహారాలు: ఇంటి ఇలవేల్పుకు పసుపు పూలతో అర్చన చేయండి.
కుంభరాశి : మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమయిన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. ఈ మధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. అపరిమితమైన సృజనాత్మకత మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. ఒకరిపట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు.
పరిహారాలు: మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చడానికి మీ నుదుటిపై సింధూరం లేదా చందన బొట్టు పెట్టుకోండి.
మీనరాశి : మీ కుటుంబసభ్యులకి సహాయం చెయ్యడానికి మీకున్న ఖాళీ సమయాన్ని కేటాయించండి. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. తగువులమారి తత్వాన్ని అదుపులో ఉంచుకొండి. ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేసేయగలదు. అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. మీ జీవితభాగస్వామితో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్ గా మీకు గడవనుంది.
పరిహారాలు: అవసరమైన వారికి ధనం లేదా ఆహార పదార్థాలను అందించడం వల్ల మీ కుటుంబానికి మంచి జరుగుతుంది.
– కేశవ