మార్చి 07 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

   

శ్రీరామ  మార్చి 7 – మాఘమాసం-ఆదివారం

మేషరాశి:మొండి బకాయిలను వసూలు !

ఈ రోజు బాగుంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ఆర్థిక లాభం కలుగుతుంది. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు.
పరిహారాలుః ఈరోజు శ్రీసరస్వతి అమ్మవారిని ఆరాధించండి.

todays horoscope

వృషభ రాశి:నమ్మకద్రోహం జరుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలం. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఎదుటి వారు చెప్పిన మాటలు విని ఎంతో మోసపోతారు. నమ్మకద్రోహం జరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీదుర్గా దేవిని ఆరాధించండి.

మిధునరాశి:కార్య లాభం కలుగుతుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఇష్టపడి చేస్తూ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్య లాభం కలుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అనవసరపు విషయాలు చర్చించడం వల్ల వివాదాలు, తగాదాలు ఏర్పడతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు.
పరిహారాలుః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

కర్కాటకరాశి:ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన వృద్ధి కలుగుతుంది. వ్యాపారాలను విస్తరించుకుంటారు. లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప పదోన్నతి పొందుతారు.
పరిహారాలుః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

సింహరాశి:అప్పుల బాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. విలువైన ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోకపోతే ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. ఇతరులను నమ్మడం వల్ల డబ్బు విషయంలో నమ్మించి మోసం చేస్తారు. జనాలకు దూరంగా ఉండండి. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు  ఎక్కువ  చేస్తారు. ధననష్టం జరుగుతుంది. బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్త వహించడం మంచిది. ఇతరులతో నోటి మాట జారడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థుల చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.
పరిహారాలుః ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి:ఉద్యోగ అవకాశాలు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప పదోన్నతులు పొందుతారు. విద్యార్థులు కష్టపడి ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. సోదరులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు.
పరిహారాలుః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

తులారాశి:ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సోదరులతో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు స్థలమార్పిడి అవుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

వృశ్చిక రాశి:ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మీలో ఉన్న తొందరపాటుతనం, కోపం వల్ల అనర్ధాలు కలుగుతాయి. విద్యార్థులకు విద్య మీదనే శ్రద్ధ వహించడం మంచిది. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల నష్టం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలించవు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఎదురవుతాయి.
పరిహారాలుః ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.

ధనస్సురాశి:స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు !

ఈరోజు సంతోషకరం గా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రమోషన్లు పొందుతారు. స్త్రీలకు  లాభం కలుగుతుంది.
పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

మకర రాశి:ప్రాణ స్నేహితులు దూరమవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టడం వల్ల విద్యా విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తి చేయరు, వాయిదా వేయడం వల్ల నష్టపోతారు. మీలో ఉన్న కోపం వల్ల తొందరపాటు తనం వల్ల మీ ప్రాణ స్నేహితులు దూరమవుతారు. నీటి సంబంధ అనారోగ్యాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నారు. తక్కువ మాట్లాడడం మంచిది.
పరిహారాలుః ఈరోజు గురు దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి:సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలను పోగొట్టుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. వ్యాపారాల నిమిత్తం ఉంచుకుంటారు. అధిక లాభాలు కలుగుతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు.  విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. అయినవారి ఆదరణ పొందుతారు.
పరిహారాలుః ఈ రోజు శ్రీలలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మీనరాశి:ఆదాయం ఎక్కువ !

ఈరోజు శుభయోగం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో కలిసిమెలిసి ఆనందంగా, సఖ్యతగా ఉంటారు. వ్యాపారాలు లాభాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆదాయం ఎక్కువ, తక్కువ ఖర్చులకు దూరంగా ఉంటారు. చేతి నిండా డబ్బు ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును, గౌరవాన్ని తిరిగి పొందుతారు.
పరిహారాలుః ఈరోజు భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.

 

  • శ్రీ

 

Read more RELATED
Recommended to you

Latest news