సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించండి! మార్చి 31 రాశిఫలాలు

మేషరాశి : అనుకూల ఫలితాలు, ధనలాభం, విందులు, స్నేహితుల వల్ల లాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, పేదలకు ధనసహాయం చేయండి.

వృషభరాశి : అనుకూల ఫలితాలు, వస్తులాభం, ఆకస్మిక ధనలాభం, వినోదాలు.
పరిహారాలు: సూర్యనారాయణ స్వామి దేవాలయ సందర్శన వీలుకానివారు సూర్యోదయ సమయాన 11 నమస్కారాలు చేయండి.

మిథునరాశి : అనుకూలం. కార్యలాభం, జయం, ఆనందం, బాకీలు వసూలు, సంతోషం.
పరిహారాలు: నారాయణ సేవ చేయండి. కనీసం 11 మందికి భోజనం పెట్టండి.

March 31th Sunday Daily Horoscope

కర్కాటకరాశి : అనుకూలం. కార్యసిద్ధి, జయం, చిన్నచిన్న ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తారు.
పరిహారాలు: రావిచెట్టుకు ప్రదక్షిణలు, శుద్ధ జలాన్ని సమర్పించండి.

సింహరాశి : విద్యాలాభం, ధనలాభం, కుటుంబంలో సంతోషం, బంధువర్గ కలయిక.
పరిహారాలు: రావిచెట్టుకు ప్రదక్షణలు, సూర్యనారాయణ దేవాయల సందర్శన లేదా 11 సూర్యనమస్కారలు చేయండి.

కన్యారాశి : అనుకూలం, పనులు పూర్తి, కుటుంబంలో సంతోషం. బంధువర్గ కలయిక.
పరిహారాలు: ఈ రోజు ఉదయాన్నే దేవాలయ దర్శన, పేదలకు వస్త్రదానం మంచిది.

తులారాశి : వ్యతిరేక ఫలితాలు, ఇంట్లోవారికి అనారోగ్య సమస్యలు, ధననష్టం.
పరిహారాలు: నవగ్రహాలకు పూజ, గోవులకు పచ్చిదానా తినిపించండి.

వృశ్చికరాశి : ప్రతికూల ఫలితాలు, అపజయం, పనుల్లో జాప్యం, వివాదాలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పూజ, ఆంజనేయస్వామికి ఆకుపూజ చేయండి.

ధనస్సురాశి : వ్యతిరేక ఫలితాలు, విద్యాలాభం, కుటుంబ సమస్యలు, ధనవ్యయం. చికాకులు.
పరిహారాలు: పేదలకు వస్త్రదానం, వస్తు దానం చేయండి.

మకరరాశి : అనుకూలం, కార్యజయం, విందులు, దేవాలయ దర్శనం,
పరిహారాలు: సూర్యనమస్కారాలు, ఇష్టదేవతారాధన చేయండి.

కుంభరాశి : వస్తులాభం, సౌఖ్యం, ఆనందం, ధనలాభం, పనులు పూర్తి.
పరిహారాలు: గణపతి హోమం లేదా గణపత దేవాలయ దర్శనం మేలు చేస్తుంది.

మీనరాశి : అనుకూలం, వాహన లాభం, ధనలాభం, విందులు, పనులు పూర్తి.
పరిహారాలు: సూర్యనారాయణ దేవాలయ దర్శనం/సూర్యనమస్కారాలు మేలు చేస్తుంది.

-కేశవ