మారేడుదళాలతో శివపూజ ఈ రాశివారికి సమస్త శుభాలనిస్తుంది!
మేషరాశి: అనుకూల ఫలితాలు, ప్రయాణ సౌఖ్యం, లాభం, కొత్త పరిచయాలు. పనులు సాగిపోతాయి.
పరిహారాలుః శివారాధన, ఉపవాసం మీకు, మీ కుటుంబానికి మేలు చేస్తుంది.
వృషభరాశి: మంచి ఫలితాలు, ధనలాభం, బంధుమిత్రులతో సంతోషం, విందులు.
పరిహారాలుః శివారాధన, జాగరణ, శివున్ని మారేడు దళాలతో అర్చిస్తే ధనలాభం విశేషంగా ఉంటుంది.
మిథునరాశి: ప్రతికూలమైన రోజు, బంధుమిత్రుల రాక, అధికశ్రమ, పనుల్లో జాప్యం.
పరిహారాలుః శివారాధన, మారేడు దళాలతతో శివార్చన మంచి ఫలితాలను ఇస్తుంది.
కర్కాటకరాశి: మిశ్రమ ఫలితం. ధనలాభం, కార్యజయం, ఆందోళన, అనవసర కలహాలు.
పరిహారాలుః శివార్చన. శివున్ని తెల్లజిల్లేడుతో పూజించుట, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించండి మంచి జరుగుతుంది.
సింహరాశి: మంచి ఫలితాలు. బంధువుల రాక, స్త్రీమూలక ధనలాభం, పనులు సాగిపోతాయి.
పరిహారాలుః శివారాధన, తెల్లజిల్లేడు, తుమ్మిపూలతో శివారాధన చేయండి మీ దోషాలు పోతాయి.
కన్యారాశి: అనుకూల ఫలితాలు, ధనలాభం, కార్యజయం, పనులు సాగిపోతాయి. విరోధాలకు, వివాదాలకు దూరంగా ఉండండి.
పరిహారాలుః శివనామస్మరణ, మారేడుదళాలతో శివార్చన, భస్మధారణ చేయండి.
తులారాశి: అనుకూల వాతావరణం. కొత్త పనులు ప్రారంభం, శుభకార్య సూచన, ధనవ్యయం. పనులు పూర్తి.
పరిహారాలుః శివరాధన, తుమ్మిపూలతో పూజ, ఎండు ఖర్జూర నైవేద్యం సమర్పించండి అనుకూల ఫలితాలు వస్తాయి.
వృశ్చికరాశి: అనుకూల ఫలితాలు. ధనలాభం, వస్తులాభం, కార్యజయం.
పరిహారాలుః ఈశ్వర ఆరాధన, బిల్వపత్రాలతో అర్చన. జాగరణ చేయండి.
ధనస్సురాశి: అనుకూలం. బంధుమిత్రుల సహకారం, ఇంట్లో సంతోషం, పనులు పూర్తి. సౌఖ్యం.
పరిహారాలుః శివనామస్మరణ, ఉపవాసం, జాగరణం మంచి ఫలితాలను ఇస్తుంది.
మకరరాశి: ప్రతికూల ఫలితాలు, ధనవ్యయం, అలసట, శ్రమ, ధననష్టం.
పరిహారాలుః శివారాధన, ప్రదోషకాలంలో శివాభిషేకం, స్తోత్రపారాయణం చేయండి మంచి జరుగుతుంది.
కుంభరాశి: అనుకూల ఫలితాలు. చేసే పనుల్లో లాభం, ధనలాభం, పనులు పూర్తి.
పరిహారాలుః శివారాధన, ఉపవాసం, జాగరణ చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది.
మీనరాశి: మిశ్రమం. ధనలాభం, వ్యాపారంలో ఆటంకం, ధననష్టం. అలసట.
పరిహారాలుః శివారాధన, ఉపవాసం, జాగరణ చేయండి.
నోట్: అన్ని రాశుల వారు సోమవారంనాడు శివారాధన, అభిషేకం, భస్మధారణ, ఉపవాసం, జాగరణ చేస్తే మీమీ జాతకాల్లో తెలిసి, తెలియని దోషాలు సైతం పోతాయి. ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. దీక్షతో లౌకిక బంధాలు, విషయాలను ఈ ఒక్కరోజైనా వదిలి ఆత్మశోధన, శివారాధన చేయండి అంతా మంచి జరుగుతుంది. ఇది వేదాల్లో పేర్కొన్న అత్యంత ప్రభావ పరిహారం. శివరాత్రి పూజ, ధ్యానం మిముల్ని ఏడాదంతా కాపాడుతుంది. అంతేకాకుండా జన్మజన్మలకు మంచిచేస్తుంది.
ఓం నమఃశివాయ!
హర హర మహాదేవ శంభోశంకర!!
– కేశవ