బిగ్ బాస్-3 కంటెస్టంట్స్ లిస్ట్ లీక్..!

-

త్వరలో స్టార్ట్ అవబోతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3కి స్టార్ మా దానికి సంబందించిన కార్యక్రమాలను మొదలుపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 1 యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా సూపర్ హిట్ అయ్యింది. ఇక సీజన్ 2 నాని హోస్ట్ గా చేశాడు. కౌశల్ ఆర్మీ వల్ల సీజన్ 2 కూడా బాగానే క్లిక్ అయ్యింది. అయితే బిగ్ బాస్ సీజన్ 3కి ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తాడని తెలిసిందే.

ఇక ఈ సీజన్ లో కంటెస్టంట్స్ గా కూడా ప్రేక్షకులకు బాగా తెలిసిన సెలబ్రిటీస్ ను తెస్తున్నారట. అందులో ఒక ఐదుగురి పేర్లు మాత్రం బయటకు వచ్చాయి. అందులో సీనియర్ యాంకర్ ఉదయభాను, ప్రస్తుత యాంకర్ మంజుషా, నటుడు దర్శకుడు జెడి చక్రవర్తి, హీరో వరుణ్ సందేష్, హీరోయిన్ పూజిత పొన్నాడ ఉన్నారు. ఈ ఐదుగురు బిగ్ బాస్ సీజన్ 3లో ఉంటారని చెబుతున్నారు.

సెలబ్రిటీస్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బిగ్ బాస్ నిర్వాహకులకు సూచించాడట ఎన్.టి.ఆర్. జూన్ లో మొదలవనున్న బిగ్ బాస్ సీజన్ 3 ఈసారి ఎంత హంగామా సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news