మే 30 రాశిఫలాలు: వేంకటేశ్వరస్వామి ఆరాధన ఈ రాశులకు మంచి ఫలితాన్నిస్తుంది!

మేషరాశి : ప్రతికూల ఫలితాలు, ఈరోజు కార్యక్రమాలను పక్కాగా ప్లాన్ చేసుకోండి, అనవసర పనులతో అసహనం, కుటుంబంలో అపార్థాలు, కంటి సంబంధ సమస్య, మైగ్రేన్, తలనొప్పి ఇబ్బందులు కలగవచ్చు.

వృషభరాశి : వ్యాపారపరంగా లాభం, ఖర్చులు పెరుగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, మనఃశాంతి, కుటుంబ సఖ్యత, ప్రయాణ సూచన.
పరిహారాలు: ఇష్టదేవతరాధన సరిపోతుంది.

may 30th Thursday daily horoscope

మిథునరాశి : పనిచేసేచోట అనుకూల మార్పులు, కుటుంబంతో ఆనందంగా గడుపుతారు, ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై సమయం వెచ్చిస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి.
పరిహారాలు: దేవాలయ దర్శనం, దైవనామస్మరణ చేసుకోండి.

కర్కాటకరాశి : అంచనాలు తారుమారు, మీ పై అధికారులు, కిందివారితో ఇబ్బందులు, ఆరోగ్యంలో మార్పులు, కుటంబంలో అపార్థాలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం చేయండి మంచి జరుగుతుంది.

సింహరాశి : శారీరక, మానసిక సమస్యలు, బీపీ, షుగర్ ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో చిన్నసమస్యలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి ఆరాధన, దేవాలయ దర్శనం చేయండి.

కన్యారాశి : వివాహ ప్రయత్నాలకు అనుకూలం, భార్యతో, పిల్లలతో సంతోషం, ప్రయాణాలు, ఆరోగ్యం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేసుకోండి సరిపోతుంది.

తులారాశి :సంతోషం, వృత్తిపరమైన అభివృద్ధి, ఆరోగ్యం, ప్రేమలు అనుకూలిస్తాయి. కుటంబంలో సంతోషం.
పరిహారాలు: దేవాలయ ప్రదక్షణలు చేయండి.

వృశ్చికరాశి : ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడండి, వ్యాపారంలో అభివృద్ధి, అలసట, అధికశ్రమ.
పరిహారాలు: వేంకటేశ్వర ఆరాధన చేయండి మంచి జరుగుతుంది.

ధనస్సురాశి : అనవసర వివాదాలు, కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, కొత్త వస్తువులు కొనడం వాయిదా వేసుకోండి, వాహనాలతో జాగ్రత్త, మానసికంగా దృఢంగా ఉండండి.
పరిహారాలు: వేంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టోతర పూజ, ప్రదక్షణలు చేయండి.

మకరరాశి:వ్యాపారంలో లాభాలు, సహనం, సంతోషం, కుటుంబ సఖ్యత, పనుల్లో పురోగతి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేసుకోండి.

కుంభరాశి : గుర్తుతెలియన వారి నుంచి ప్రమాద సూచన జాగ్రత్త, నిద్రలేమి, ఆర్థికంగా ఇబ్బంది, ఆదాయానికి మించిన ఖర్చులు, కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అర్చన, ప్రదక్షణలు చేస్తే మంచిది.

మీనరాశి :మీ ఆలోచనలతో ఆదాయంలో వృద్ధి, పనులు పూర్తి, రివార్డులు, విజయం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేసుకోండి.

– కేశవ