ఈనెల 31న ప్రపంచ వ్యతిరేక పొగాకు దినోత్సవం సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ రెండు రోజుల పాటు వర్క్ షాప్ ను నిర్వహించారు. ఆ వర్క్ షాప్ లో నగరాన్ని స్మోక్ ఫ్రీ హైదరాబాద్ గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఆపరేషన్ స్మోకింగ్.. అంటే సిగిరెట్ తాగడాన్ని నియంత్రించడం. అది పబ్లిక్ ప్రాంతాల్లో. దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. వచ్చే అక్టోబర్ లో నగరంలో నిర్వహించబోయే హెల్త్ కాన్ఫరెన్స్ కు కంటే ముందు హైదరాబాద్ ను స్మోక్ ఫ్రీ నగరంగా మార్చాలన్న లక్ష్యంతో హైదరాబాద్ పోలీసులు.. ఆపరేషన్ స్మోకింగ్ ను యుద్ధప్రాతిపదికన అమలు చేయబోతున్నారు. అసలు.. ఆపరేషన్ స్మోకింగ్ అంటే ఏంటి? బహిరంగంగా పొగ తాగిన వాళ్లను ఏం చేస్తారు? ఫైన్ వేస్తారా? జైలులో వేస్తారా? ఏం చేస్తారో సవివరంగా తెలుసుకుందాం పదండి..
పొగ తాగడం వల్ల పొగ తాగిన వ్యక్తికే కాదు.. ఆ పొగను పీల్చిన వాళ్లకు కూడా ఎఫెక్టే. నిజం చెప్పాలంటే దాన్ని పీల్చిన వాళ్లకే ఎక్కువ ఎఫెక్ట్. అందుకే బహిరంగంగా పొగ తాగకూడదని చెబుతుంటారు. కానీ.. ఎవరైనా వింటే కదా. బహిరంగ ప్రదేశాల్లో కూడా గుప్పుగుప్పుమంటూ పొగను వదులుతుంటారు. దాంతో పక్కన నిలబడే వాళ్లకు కూడా లేనిపోని రోగాలు తెప్పిస్తున్నారు.
ఈనెల 31న ప్రపంచ వ్యతిరేక పొగాకు దినోత్సవం సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ రెండు రోజుల పాటు వర్క్ షాప్ ను నిర్వహించారు. ఆ వర్క్ షాప్ లో నగరాన్ని స్మోక్ ఫ్రీ హైదరాబాద్ గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.
దానిలో భాగంగానే ఆపరేషన్ స్మోకింగ్ ను ప్రారంభించారు. ఎవరైనా నిషేధిత ప్రాంతాల్లో పొగతాగితే.. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి 200 రూపాయల ఫైన్ వేసి హెచ్చరిస్తారు. కౌన్సెలింగ్ ఇస్తారు. మళ్లీ వాళ్లు అలాగే ప్రవర్తిస్తే.. వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. దాని కోసం సిగిరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం 2003ని పటిష్టవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో నో స్మోకింగ్ పై అవగాహన సెంటర్లను నిర్వహిస్తున్నారు.
అయితే.. హైదరాబాద్ ను నో స్మోకింగ్ సిటీగా మార్చాలంటే ప్రజలు భాగస్వామ్యం కూడా ముఖ్యమని సీపీ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా పొగ తాగుతుంటే.. పక్కన ఉన్న వాళ్లు ఎవరైనా సరే.. వెంటనే 100 నెంబర్ కు డయల్ చేసి చెప్పొచ్చు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని బహిరంగ ప్రదేశంలో పొగ తాగిన వాళ్లకు ఫైన్ విధిస్తారు. స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇస్తారు.
రెండో స్థానంలో ఇండియా
ప్రపంచ దేశాల్లో స్మోకింగ్ లో చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా… ఇండియా రెండో ప్లేస్ లో ఉంది. పొగతాగడం వల్ల టీబీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా వస్తుండటంతో.. దీనిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సీపీ వర్క్ షాప్ లో తెలిపారు.
అక్టోబర్ లో హైదరాబాద్ లో నిర్వహించే 50వ ప్రపంచ సదస్సు కూడా స్మోకింగ్ ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించేదేనని సీపీ తెలిపారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఆలోపు హైదరాబాద్ ను స్మోక్ ఫ్రీ సిటీగా మార్చడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని సీపీ కోరారు.