నవంబర్ 21 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

 

నవంబర్‌- 21- శనివారం. కార్తీకమాసం.

మేషరాశి:ఈరోజు కెరీర్‌ విషయంలో ఆందోళన !

నూతన ప్రాజెక్ట్ గురించి మీ కార్యాలయంలోని సహచరులతో చర్చిస్తారు. వారు మీకు మద్దతు తెలుపుతారు. కెరీర్ విషయంలో ఆందోళన చెందుతారు. ఇంటి సమస్యల్లో కూడా కుటుంబ సభ్యులు మీకు మద్దతు తెలుపుతారు. భవిష్యత్ ప్రణాళికలు విషయంలో ముందంజలోనే  ఉంటారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీకార్తీకదామోదర ఆరాధన చేయండి.

todays horoscope

వృషభరాశి:ఈరోజు సీనియర్ల వల్ల ఇబ్బందులు !

సీనియర్ అధికారులు మిముల్ని పరీక్షిస్తారు. ఇతర ఆదాయ వనరుల కోసం నూతన కార్యాచరణ మొదలు పెడతారు. అడ్డంకులు ఎదుర్కొంటు పనులు పూర్తి చేయాల్సి  ఉంటుంది. ఉపాధి రంగంలో నూతన అవకాశాలు అందే సూచనలు ఉన్నాయి. ఆస్తి పత్రాలలో సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు చదువుకోండి. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు.

పరిహారాలుః శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

 

మిధునరాశి:ఈరోజు పోయిన వస్తువులు దొరుకుతాయి !

పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి మీ చెంతకు వస్తుంది. ఈరోజు మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి అనువైన సమయం లభిస్తుంది. తల్లితండ్రులను గౌరవించండి. ఇంటి అవసరాలను పూర్తిగా చూసుకునే అవకాశం ఉంటుంది. జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

 

కర్కాటకరాశి:ఈరోజు ఆనందంగా గడుస్తుంది !

పిల్లల కెరీర్ విషయమై ఆందోళనలు ముగుస్తాయి. ఈరోజు ఆనందంగా గడుస్తుంది. రాజకీయాలకు సంబంధించి, సామాజిక అంశాలకు సంబంధించి పనులు చేసే అవకాశం లభించవచ్చు. స్నేహితులతో వివాదాలు ముగుస్తాయి. నెరవేరని లక్ష్యాలను పూర్తి చేయడానికి అవకాశం. జీవిత భాగస్వామితో ఆనందం.

పరిహారాలుః శ్రీకార్తీక దామోదర ఆరాధన చేయండి.

 

సింహరాశి:ఈరోజు ఆదాయం పెరుగుతుంది !

కుటుంబ వ్యాపారం పెంచే విషయంలో తండ్రి సాయం లభిస్తుంది. ఆదాయాలు పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే, ఆదాయానికి తగ్గట్లే ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు కొంతమంది కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. వారు మీకు భవిష్యత్ లో సాయం అందిస్తారు. వైవాహిక జీవితస్వామితో సంతోషంగా గడుపుతారు.

పరిహారాలుః శ్రీరామ రక్షాస్తోత్రం పారాయణం చేయండి.

 

కన్యరాశి:ఈరోజు మీ సోదరుల సహకారం !

వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలించే సమయం. మీ కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. మీ సోదరుడు సాయం అందిస్తాడు. మీ స్నేహితులు గతం లో కంటే మెరుగైన విధం గా పని చేయాలనీ సూచిస్తారు. కుటంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

 

తులరాశి:ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది !

కుటుంబ విషయంలో మీరు రాజీ పడాల్సి వస్తుంది. సామాజిక బాధ్యతలను నిర్వర్తించడానికి మీ కుటుంబం మీకు సాయం అందిస్తుంది. సామాజిక పనులను చేయడం వలన సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ పనుల్లో విజయం సాధిస్తూ ముందుకు పోతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

పరిహారాలుః తులసీ దగ్గర ఆవునెయ్యి దీపంతోపాటు కుంకుమ, పసుపు వేయండి.

 

వృశ్చికరాశి:ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నవారికి కీర్తి !

కార్యాలయంలో వాతావరణం మీ పనికి అనుకూలిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారి కీర్తి విస్తరిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు ఇష్టమైన వారి నుంచి బహుమతి పొందే అవకాశం ఉంది. ఆర్ధిక సమస్యలు పరిష్కరించబడుతాయి.

పరిహారాలుః శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి. మంచి ఫలితాలు వస్తాయి.

 

ధనుస్సురాశి:ఈరోజు సహోద్యుగులు మద్దతు లభిస్తుంది !

వాతావరణాన్ని సజీవంగా మార్చుకోడానికి ప్రయత్నాలు చేస్తారు. కార్యాలయంలో శ్రద్ధగా పని చేయండి. మీ సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు. సోషల్ మీడియా నుంచి మీ దృష్టిని మళ్లించగలితే చదువు పై మరింత దృష్టి కేంద్రీకరించగలుగుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీశివారాధన చేయండి. అరోగ్యం లభిస్తుంది.

 

మకరరాశి:ఈరోజు మిశ్రమంగా ఉంటుంది !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కష్టపడి పని చేసినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారంలో ఆచి తూచి వ్యవహరించండి. కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు కొంత మానసిక వత్తిడిని కలిగిస్తాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీసోమేశ్వరస్వామి అభిషేకం, ఆరాధన చేయండి.

 

కుంభరాశి:ఈరోజు వ్యాపారులకు అనుకూలం !

విద్యార్థులకు మంచి సమయం. వ్యాపారంలో సమయానికి తగ్గట్లు తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.  రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు వచ్చే అవకాశాలున్నాయి.  వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీ, చంద్ర ఆరాధన వల్ల ఆర్థికంగా ప్రయోజనాలు వస్తాయి.

 

మీనరాశి:ఈరోజు ఖర్చులను తగ్గించుకోండి !

పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోండి. స్నేహితుల మద్దతుతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. మీ పై అధికారుల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. స్నేహితుల సాయంతో మీరో పెద్ద ప్రాజెక్ట్ ను ఖాయం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ సందర్శన, ప్రదక్షణలు చేయండి.

-శ్రీ