పెళ్లంటే ద్వేషించే 4 రాశులు ఇవే.. వారి ఆలోచనలు ఎప్పుడు వాటిపైనే..

ఈ రోజుల్లో చాలామంది.. పెళ్లి మీద ఆసక్తి లేరు. లైఫ్ అంతా పెళ్లిపెటాకులు లేకుండా ఉండిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్తుంటారు.. చుట్టు ఉన్న సమాజం, వారి జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు వారిని ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయి అని మనం అనుకుటాం.. కానీ కొన్నిసార్లు వారి రాశి ప్రభావం కూడా అలా ఆలోచించేలా చేస్తుంది. రాశుల ప్రకారం.. మన ఆలోచనా విధానం ఉంటుందనేది పండితుల మాట. అలా చూస్తే.. కొందరు ప్రేమకు దూరంగా ఉంటారు, చట్టబద్ధంగా ఒకే వ్యక్తికి కట్టుబడి ఉండాలనే ధోరణిలో ఉండరు. ఏ రిలేషన్ లేకుండా..హ్యాపీగా లైఫ్ అంతా ఉండిపోవాలనుకుంటారు..ఇదంతా వారి రాశిచక్రం ప్రకారమే..జరుగుతుందట. ఈరోజు మనం..ఏ రాశుల వారు పెళ్లంటే దూరంగా ఉంటారో చూద్దాం.

కుంభరాశి

ఈ రాశివారు స్వేచ్ఛాయుతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ, వివాహంలో మాత్రం ఎవరితోనూ ముడిపడి ఉండాలనే ఆలోచనను వారు వ్యతిరేకిస్తారు. ఎవరికీ కట్టుబడి, లొంగి ఉండలేరు.

మిథున రాశి..

పాపం ఈ రాశి వారు.. వారి జీవంతాన్ని ఎలాంటి సరదాలు లేదా ఉత్సాహం లేకుండా గడిచిపోతుంది. పెళ్లి చేసుకుని జీవితాంతం బంధం వేసుకోవాలనే ఆలోచన వీరికి దాదాపు ఒక పీడకలగానే మిగిలిపోతుంది. పెళ్లి చేసుకుంటే సోషల్ లైఫ్ పాడవుతుందని ఈ రాశి వారు భయపడతారు.

మీనరాశి

మీన రాశివారు పెళ్లి ఆలోచనతో విసిగిపోతారు. ఏదైనా.. సమస్యలు తలెత్తినప్పుడు, వారు రెండవ ఆలోచన చేయకుండా పారిపోతారు. కఠినమైన భావోద్వేగాలు, కన్నీళ్లు, ఆరోపణలు నిరాశతో ఉండే లైఫ్ ను వారు భరించలేరు.

ధనస్సు రాశి

ఇక ఈ రాశి వారి విషయానికొస్తే.. చాలా సాహసోపేతంగా ఉంటారు. జీవితాన్ని భావోద్వేగాల రోలర్‌కోస్టర్‌గా చూస్తారు. కాబట్టి వారు ఒక వ్యక్తి కోసం స్థిరపడకూడదనుకోవడం వల్ల వారు వివాహం చేసుకోకుండా ఉండాలనుకుంటారట..కొత్త వ్యక్తులను కలవాలని..వారికి చేయగలిగినదంతా చేయాలని కోరుకుంటారు. ఎలాంటి పశ్చాత్తాపాన్ని ఉంచుకోరు.

ఈ రాశుల వారు పెళ్లి విషయంలో ఉండే మెంటాలిటీ ఇది అని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చెప్తున్నారు. అంటే.. ఇక రాశుల వారు ఎప్పుటికీ పెళ్లి చేసుుకోరు అని కాదు. పెళ్లి విషయంలో ఇలా ఆలోచిస్తారు అని మాత్రమే. ఇంతకీ మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా..?