ఇక‌పై ఒక నిమిషానికి 59 సెకండ్లే.. ఎందుకంటే..?

-

ఒక ఏడాదికి 365 రోజులు. రోజుకు 24 గంట‌లు. గంట‌కు 60 నిమిషాలు. నిమిషానికి 60 సెక‌న్లు.. ఏంటీ.. టైం లెక్క చెబుతున్నారేంటీ.. అనుకుంటున్నారా.. అవును.. ఇది టైం లెక్కే. అయితే ఇక‌పై ఈ లెక్క మార‌నుంది. అంటే.. నిమిషానికి 60 సెక‌న్లు కాదు, 59 సెక‌న్లే కానున్నాయి. అవును.. సైంటిస్టులు ఒక నిమిషం నుంచి ఒక సెక‌న్‌ను తొల‌గించాల‌ని చూస్తున్నారు. అందుకు కార‌ణం భూమి చాలా వేగంగా ప‌రిభ్ర‌మిస్తుండ‌డ‌మే.

soon scientists may remove 1 second in 1 minute

గ‌త కొన్నేళ్ల నుంచి భూమి చాలా వేగంగా ప‌రిభ్ర‌మిస్తుంద‌ని సైంటిస్టులు నిర్దారించారు. సాధార‌ణంగా భూమి ఒక‌సారి త‌న చుట్టూ తాను తిరిగే స‌రికి 24 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. కానీ వేగంగా తిరుగుతుండ‌డం వ‌ల్ల టైం త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలో త‌గ్గే టైంను ప్ర‌స్తుతం ఉన్న టైంతో సింక్ చేయాలంటే అందుకు ఒక నిమిషం నుంచి 1 సెక‌న్‌ను తొల‌గించాల్సి ఉంటుంది. దీంతో టైం స‌రిగ్గా సింక్ అవుతుంది.

అయితే గ‌తంలో ఒక‌సారి సైంటిస్టులు 1 మిల్లీ సెక‌న్ టైమ్‌ను అడ్జ‌స్ట్ చేశారు. దీంతో కంప్యూట‌ర్లు, శాటిలైట్లు అన్నీ క్రాష్ అయ్యాయి. అయితే సారి ఏకంగా 1 సెక‌న్‌ను అడ్జ‌స్ట్ చేస్తే దాని ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. చాలా గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని అంటున్నారు. అలాటంప్పుడు టైమ్‌ను ఎలాంటి ఇబ్బంది రాకుండా అడ్జ‌స్ట్ చేయాల్సి ఉంటుంది. మ‌రి ఈ విష‌యంలో సైంటిస్టులు ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news