తిరుగు ప్రయాణంలో తిప్పలు.. ఇంకా అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్‌

-

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, తోటి వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ ఈనెల 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సింది. కానీ తమ రోదసి ప్రయాణాన్ని పూర్తి చేయడంలో వీరికి పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి.

ఈనెల 14న వారు భూమిపైకి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో భూమిపై ల్యాండింగ్‌ను వాయిదా వేశారు. జూన్‌ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా.. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. ఇంకా కొత్త తేదీని ఇంకా వెల్లడించలేదు.

సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదాపడిన తర్వాత ఎట్టకేలకు  భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పడంలేదు. స్టార్‌లైనర్‌ వ్యోమనౌకకు ఇదే తొలి మానవసహిత యాత్ర. భూమి నుంచి బయలుదేరే సమయంలోనూ దీనికి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రోదసిలోకి వెళ్లిన తర్వాత కూడా కాస్త ఆలస్యంగా ఐఎస్‌ఎస్‌తో ఈ వ్యోమనౌక అనుసంధానం కాగలిగింది. ఇప్పుడు తిరుగు ప్రయాణంలోనూ సమస్యలు తప్పడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news