చంద్రుడిపై రష్యా ప్రయోగించిన లూనా-25 స్పేస్ క్రాప్ట్ ల్యాండర్ క్రాష్ అయింది. చంద్రుడిపై అడుగుపెట్టడానికి ముందే అది కుప్పకూలినట్టు రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ అధికారికంగా ప్రకటించింది. లూనా-25 లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని వెల్లడించిన కొద్ది గంటలకే అది కుప్పకూలినట్టు గుర్తించారు.
దాదాపు 47 సంవత్సరాల తరువాత ఆగస్టు 11న రష్యా చంద్రునిపై లూనాను పంపించగా.. చంద్రుని దక్షిణ దృవంపై దిగేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. లూనా-25 చంద్రుని కక్ష్యలోకి చేరుకుంది. అయితే అక్కడి నుంచి చంద్రుడిపైకి ఇవాళ ల్యాండర్ దిగాల్సి ఉంది. ఇది 47 ఏళ్లో దేశం యొక్క మొట్టమొదటి చంద్ర ల్యాండర్ మిషన్. సోవియట్ యుగంలో అన్ని మునుపటి మిషన్లు చేపట్టబడినందున ఇది చంద్రునికి తొలి రష్యన్ మిషన్ గా పరిగణించబడుతుంది. మరోవైపు భారత్ పంపిన చంద్రయాన్ – 3 ల్యాండర్ ని చంద్రుడి దక్షిణ దృవం వద్ద సాప్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో మరో రెండు రోజుల్లో ప్రయత్నించనుంది.