మొట్టమొదట మన గ్రహం పై నీరు ఎలా వచ్చిందంటే….!

ఇప్పుడు మనం చక్కగా నీటిని అనేక విధాలుగా ఉపయోగిస్తూ సంతోషంగా ఉన్నాం. అయితే అసలు మన గ్రహం పైకి నీరు ఎలా వచ్చిందో తెలుసా..? తెలియక పోతే ఇక్కడ క్లుప్తంగా వివరించడం జరిగింది చూసేయండి. భూగ్రహం పై నీటి ఆవిర్భావానికి వెనుక దాగిన రహాస్యాన్ని ఖగోళ సైంటిస్టులు బయట పెట్టేసారు. పూర్తిగా చూస్తే.. భూమిపై నీటి ఆవిర్భావానికి ఉల్కలే కారణమని చెప్పారు.

meteorite

కొన్ని మిలియన్ల ఏళ్ల క్రితం జరిగిన దానిని చూస్తే… భూమి పైకి వచ్చిన ఉల్కల్లో ద్రవపు నీరు ఉండొచ్చునని వాళ్ళు అంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇటీవల భూమి పైకి వచ్చిన కొన్ని ఉల్కల ఆధారంగా కనిపెట్టడం జరిగింది. దీని ప్రకారం నీటి ఆవిర్భావానికి అవే కారణమై ఉంటాయని చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ ఉల్కల్లో ద్రవపు నీటి తో కూడిన కెమికల్ రియాక్షన్ బిలియన్ సంవత్సరాల క్రితమే ఆగిపోయి ఉండొచ్చునని సూచిస్తున్నాయి. గత శతాబ్దంలో భూమి పైకి వచ్చిన 9 ఉల్కలను లోతుగా విశ్లేషించారు.

ఈ ఉల్కలు ఒకప్పుడు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన గ్రహశకలాలుగా గుర్తించారు ఆస్ట్రేలియాలోని సిడ్నీ లోని మాక్వేరీ యూనివర్శిటీలో (Simon Turner) బృందం. అయితే ఇలా కనుక జరిగితే ఉల్క లోని మంచు భాగం కరిగిపోయి ఒక భాగం నుంచి మరొక భాగానికి కదులుతాయని టర్నర్ చెప్పారు. యురేనియం, థోరియం నమూనాల ఆధారంగా గత మిలియన్ ఏళ్ల లో ఉల్కలు ద్రవ నీటి తో కూడిన కెమికల్ రియాక్షన్స్ జరిగి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.