4 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో Moto G52.. ధర ఎంతంటే..!

-

మోటొరోలా నుంచి మోటొరోలా జీ52 స్మార్ట్ ఫోన్ యూరప్ లో లాంచ్ చేశారు. గత ఏడాది లాంచ్ చేసిన.. జీ51 తర్వాతి వర్షన్ గా ఇది ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పని చేసే…ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ధర , కెమేరా క్వాలిటీ వివరాలు ఇలా ఉన్నాయి..

మోటో జీ52 హైలెట్స్..

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 87.7 శాతం కాగా… యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5000 ఎంఏహెచ్ కాగా… 30W టర్బో పవర్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 37.9 గంటల ప్లేబ్యాక్ టైంను ఇది అందించనుంది.
కెమేరా క్వాలిటీ..
ఇందులో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఇందులో ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

మోటో జీ52 ధర..

ప్రస్తుతానికి ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను 249 యూరోలుగా అంటే మన కరెన్సీలో సుమారు రూ.20,600గా నిర్ణయించారు.
చార్‌కోల్ గ్రే, పొర్స్‌లెయిన్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news