అమెజాన్‌లో యాపిల్ డేస్ సేల్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఫోన్లు, ఇత‌ర యాపిల్ ప్రొడ‌క్ట్స్‌..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో యాపిల్ డేస్ సేల్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ మంగ‌ళ‌వారం ప్రారంభం కాగా జూలై 17వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా యాపిల్‌కు చెందిన ప‌లు ప్రొడ‌క్ట్స్‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఐఫోన్ 11, 12 సిరీస్‌ల‌కు చెందిన ఫోన్ల‌ను ఈ సేల్‌లో త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

అమెజాన్/Amazon
అమెజాన్/Amazon

అమెజాన్‌లో ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్ రూ.70,900కు అమ్ముడ‌వుతుండ‌గా దీనిపై రూ.9000 వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో అద‌నంగా మ‌రో రూ.6000 డిస్కౌంట్ ను ఇస్తారు. దీంతో భారీ త‌గ్గింపు ధ‌ర‌కు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. మొత్తం రూ.15వేల డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఇక ఐఫోన్ 11, 12 సిరీస్ ఫోన్లపై అద్భుత‌మైన ఈఎంఐ ఆప్ష‌న్ల‌ను కూడా అందిస్తున్నారు.

ఐప్యాడ్ మినీ, మాక్‌బుక్ ప్రొల‌పై కూడా యాపిల్ డిస్కౌంట్ల‌ను అందిస్తోంది. అమెజాన్ యాపిల్ డేస్ సేల్‌లో కొనుగోలు చేసే ఉత్ప‌త్తుల‌పై వినియోగ‌దారులు 15 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. ఐప్యాడ్‌లు, యాపిల్ వాచ్‌లు, ఐప్యాడ్ యాక్స‌స‌రీలు, మాక్ యాక్స‌స‌రీలు, కీబోర్డులు, కేబుల్స్, ప‌వ‌ర్ అడాప్ట‌ర్లు, ఐఫోన్ 8 ప్ల‌స్, 8, 7, ఎక్స్ \ఆర్‌, ఎక్స్ ఫోన్ల‌ను ఈ సేల్‌లో త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news