అన్‌లాక్ మార్గదర్శకాలు: ఇక తెలంగాణలో అన్ని కోర్టులు ఓపెన్

-

కోర్టుల్లో అన్ లాక్ ప్రారంభించాలని తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని హైకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతున్నారు. అయితే.. తాజాగా ఈ నెల 19 నుంచి కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఈ నెల 31 వరకు ఆన్ లైన్ విచారణ ఉండనున్నట్లు స్పష్టం చేసింది హైకోర్టు.

మిగతా ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 16 వరకు ఆన్ లైన్ విచారణ ఉండనున్నట్లు తెలిపింది. మిగతా జిల్లాల్లో ఈ నెల 19 నుంచి పాక్షికంగా ప్రత్యక్షంగా విచారణ ప్రారంభించాలని పేర్కొంది హైకోర్టు. హైకోర్టు లో ఈ నెల 31 వరకు ఆన్ లైన్ విచారణ విధానం కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news