యాపిల్ కార్ వచ్చేస్తుంది… ఎప్పుడంటే

-

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇంక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీతో ముందుకు వెళ్తుంది. సొంతగా యాపిల్ కార్ ని విడుదల చేయడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ కార్ ని ఉత్పత్తి చేయడానికి 2024 ను లక్ష్యంగా పెట్టుకుందని టెక్ వర్గాలు వెల్లడించాయి. ప్రాజెక్ట్ టైటాన్ అని పిలువబడే ఈ ప్రాజెక్ట్ ని యాపిల్ ముందుకు తీసుకు వెళ్తుంది. 2014 నుండి మొదటి కార్ తయారి కోసం యాపిల్ ప్రయత్నాలు చేస్తుంది.

ఒక దశలో, ఆపిల్… ఈ కార్ పై వెనక్కు తగ్గింది. అంచనాలు పెరిగిపోవడంతో యాపిల్ వెనక్కు తగ్గిందని వార్తలు వచ్చాయి. టెస్లాలో పనిచేసిన అనుభవజ్ఞుడైన డగ్ ఫీల్డ్, 2018 లో ఈ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి తిరిగి వచ్చి, 2019 లో ఈ జట్టు నుండి 190 మందిని తొలగించారు. అప్పటి నుండి,… ఆపిల్ నూతన వాహనం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దీనిపై వార్తలు మాత్రం బయటకు రాలేదు.

అయితే టెస్లా సహకారంతో యాపిల్ ఈ కార్ ని ముందుకు తీసుకువెళ్ళాలి అని భావించినా సరే అది సాధ్యం కాలేదు. వాహనాన్ని తయారు చేయడం అనేది ఆపిల్‌కు పెద్ద సవాల్ గా మారింది అని టెక్ నిపుణులు చెప్పారు. టెస్లాకు 17 సంవత్సరాల సమయం పట్టింది. మరో కంపెనీపై యాపిల్ కచ్చితంగా ఆధారపడాల్సిందే అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news