ఫోన్‌ అలా ఛార్జింగ్‌ పెట్టొద్దు.. యాపిల్‌ వార్నింగ్

-

నేటి తరం మొబైల్ కు విపరీతంగా అడిక్ట్ అయింది. ఎంతలా అంటే.. మొబైల్ ఛార్జింగ్ అవుతున్న సమయంలోనూ వాడే అంత. అయితే ఇలా ఫోన్ ఛార్జింగ్ పెట్టిన సమయంలో వాడటం వల్ల ఇప్పటికే చాలా మంది ప్రమాదాలు జరిగి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంలో ఐఫోన్లు తయారు చేసే సంస్థ యాపిల్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఛార్జింగ్‌ పెట్టి దాని పక్కనే పడుకోవటం కూడా చాలా ప్రమాదకరమని ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్ తెలిపింది. ఇలా చేస్తే ఒకో సారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వినియోగదారులకు సూచించింది.

ఛార్జర్‌, అడాప్టర్, ఫోన్‌పై పడుకోకండి. వీటిని దిండు, దుప్పట్ల వద్ద ఉంచకండని యాపిల్ సూచించింది. ఎల్లప్పుడూ గాలి, వెలుతురు ఉండే ప్రదేశాల్లో ఫోన్‌ ఛార్జ్ చేయాలని.. ఫోన్ ఛార్జ్‌ అవుతున్న సమయంలో మొబైల్‌ వాడటం చాలా ప్రమాదకరం అంటూ ఐఫోన్ సంస్థ హెచ్చరింది. ఇతర థర్డ్‌ పార్టీ ఛార్జర్ల సాయంతో ఐఫోన్‌కు ఛార్జింగ్‌ చేయటానికి వీలవుతుందని.. దీంతో ఇతర వాటిని ఉపయోగించి ఛార్జింగ్‌ చేయటం చాలా ప్రమాదకరమని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news