రేవంత్ రెడ్డికి షాక్.. సెక్యూరిటీని తగ్గించిన ప్రభుత్వం..!

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి సెక్యూరిటిని తగ్గించింది ప్రభుత్వం. ఇటీవల 4+4 భద్రతను 2+2 కి ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు భద్రతను 1+1కి మరోసారి కుదించింది. రేవంత్ రెడ్డి భద్రత కుదింపు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెండు నెలల కిందటే తనకు భద్రత కల్పించాలని కోర్టులో పిటీషన్ వేశారు రేవంత్ రెడ్డి.

కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వకముందే ప్రభుత్వం ఇలా చేయడంపై రేవంత్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం 1+1 సెక్యూరిటీ కూడా వద్దని ఈరోజు తిరిగి ఉదయం నుంచి సెక్యూరిటీ లేకుండానే రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. ఎలాంటి కారణాలు లేకుండానే తెలంగాణ పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్ మెన్లను తొలగించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. గతంలో తన భద్రత పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక వినతులు చేశారు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా స్పందించలేదు. 

Read more RELATED
Recommended to you

Latest news