అసుస్ నుంచి వివోబుక్ అల్ట్రా సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. ధ‌ర రూ.42,990 నుంచి..

-

అసుస్ సంస్థ జెన్‌బుక్‌, వివోబుక్ అల్ట్రా సిరీస్‌లో ప‌లు నూత‌న ల్యాప్‌టాప్‌ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటిల్లో ఇంటెల్ 11వ జ‌న‌రేష‌న్ కోర్ ప్రాసెస‌ర్‌ల‌ను అమ‌ర్చారు. ఇంటెల్ ఐరిస్ జి గ్రాఫిక్స్ ను అందిస్తున్నారు. ఇవి అద్భుత‌మైన కూలింగ్ టెక్నాల‌జీని క‌లిగి ఉన్నాయి. అందువ‌ల్ల అంత త్వ‌ర‌గా హీట్ అవ్వ‌వు. ఇక వేగ‌వంత‌మైన ర్యామ్ ను వీటిల్లో అందిస్తున్నారు.

- Advertisement -

asus vivobook ultra series laptops launched in india

ఈ ల్యాప్‌టాప్‌ల‌లో ఇంటెల్ కోర్ ఐ7-1165జి7 ప్రాసెస‌ర్‌, ఎన్‌వీడియా ఎంఎక్స్ 330 గ్రాఫిక్స్‌, 8జీబీ వ‌ర‌కు ర్యామ్‌, పీసీఐ-ఇ ఎస్ఎస్‌డీలు ఏర్పాటు చేసుకునే స‌దుపాయం.. త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే హెచ్‌డీఎంఐ పోర్ట్‌, యూఎస్‌బీ టైప్ సి, వైఫై 6 త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా వీటిల్లో అందిస్తున్నారు.

అసుస్ జెన్‌బుక్ 14 ల్యాప్ టాప్ ప్రారంభ ధ‌ర రూ.82,990 ఉండ‌గా, వివోబుక్ అల్ట్రా కె15 ప్రారంభ ధ‌ర రూ.42,990గా ఉంది. అలాగే వివోబుక్ అల్ట్రా 15 రూ.43,990 ప్రారంభ ధ‌ర‌కు, వివోబుక్ అల్ట్రా 14 రూ.59,990 ప్రారంభ ధ‌ర‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...