మీ స్మార్ట్‌ఫోన్‌ ని ఇలా రిమోట్‌గా మార్చెయొచ్చు!

-

ఈ రోజుల్లో అందరికీ ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఉంటున్నాయి. కరోనా పుణ్యమా అని పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం కూడా ఫోన్‌ లేదా ట్యాబ్‌లను కొన్నవారు కూడా ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే.. సాధారణంగా టీవీ ఛానల్‌ మార్చేందుకు రిమోట్‌  ద్వారా మారుస్తాం. కానీ, ఒకవేళ సరైన సమయంలో రిమోట్‌ దొరకకపోతే! మన చేతిలో ఎప్పుడూ ఉంటుంది కదా! స్పేర్‌ రిమోట్‌. అదే మన స్మార్ట్‌ ఫోన్‌. దీంతో మనం టీవీ ఆపరేట్‌ చేయవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో దాదాపు అందరి ఇళ్లలో ఆండ్రాయిడ్‌ టీవీలే ఉంటున్నాయి. వీటిని గూగుల్‌ ఆపరేటింగ్‌ సిస్టం ద్వారా కంటెంట్‌ను నేరుగా చూడగలుగుతున్నాం. ఈ టీవీలు ల్యాప్‌టాప్‌ లేదా ఫైర్‌స్టిక్‌ సాయంతో కాకుండా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఎలా ఆపరేట్‌ చేయాలో చూద్దాం.

 

android-tv

  • ముందుగా మీ స్మార్ట్‌ మొబైల్, టీవీ రెండూ కూడా ఒకే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయి ఉండాలి.
  • మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీ మొబైల్‌లోని ఆండ్రాయిడ్‌ టీవీ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
  • మీ ఆండ్రాయిడ్‌ టీవీ ఏ కంపెనీదో ఆ పేరు ఎంటర్‌ చేయాలి.
  • ఆండ్రాయిడ్‌ టీవీ పిన్‌ను ఎంటర్‌ చేసి, ఫోన్‌కు అది లింక్‌ చేయాలి.
  • ఆ యాప్‌లో ఉండే కంట్రోల్‌ బటన్స్‌ ద్వారా టీవీని ఆపరేట్‌ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news