ఈ మధ్య ప్రతి ఒక్కరూ వాట్సాప్ ని వాడుతున్నారు. నిజానికి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని వాడుతున్నారు. వాట్సాప్ ద్వారా మనం మెసేజ్లను సులభంగా పంపించుకోవచ్చు. అలానే ఫోటోలను, వీడియోలను కూడా మనం షేర్ చేసుకోవడానికి అవుతుంది. అయితే వాట్సాప్ రోజు రోజుకి కొత్త ఫీచర్లను తీసుకు వస్తూ ఉంటుంది.
ఈ ఫీచర్ల తో మనం మరింత ఈజీగా వాట్సాప్ ను ఉపయోగించుకోవచ్చు. నిజానికి ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఫీచర్ల గురించి తెలుసుకోవాలి. లేదంటే వాట్సాప్ ని వాడడం కష్టంగా ఉంటుంది. ఫీచర్లు కనుక తెలిసాయి అంటే సులభంగా మనం వాట్సాప్ ను ఉపయోగించుకో వచ్చు. అయితే మనం ఎవరికైనా మెసేజ్లు పంపించిన ఎవరైనా మనకి మెసేజ్ పంపిన ఫాంట్ సైజ్ అనేది చాలా ముఖ్యం.
ఫాంట్ సైజ్ సరిగా లేకపోతే మనం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. వాట్సాప్ ని ఉపయోగించేటప్పుడు ఫోన్ లో ఫాంట్ సైజ్ ని మనం మార్చుకోవచ్చు. వాట్సప్ యాప్ లో మనం ప్రత్యేకంగా ఫాంట్ సైజ్ సెట్ చేసుకోవాలి. ఇక అది ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.
ముందుగా మీరు మీ ఫోన్ లో వాట్సాప్ ను ఓపెన్ చేయండి.
రైట్ సైడ్ టాప్ లో మూడు చుక్కలు ఉంటాయి. అక్కడ క్లిక్ చేయండి.
ఒక పాప్అప్ ఓపెన్ అవుతుంది.
దానిలో మీరు చాట్ సెట్టింగ్స్ ని సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత చాట్ పై క్లిక్ చేయండి.
చాట్ విభాగం ఎంచుకున్నాక ఫాంట్ సైజు విండో ఓపెన్ అవుతుంది.
ఆ విండోలో మీరు మీకు నచ్చిన విధంగా ఫాంట్లను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.