డెల్‌ కంప్యూటర్‌ వాడుతున్నవారికి అలర్ట్‌!

-

మీరు డెల్‌ కంపెనీ కంప్యూటర్‌ వాడుతున్నారా? అయితే, మీరు అలర్ట్‌ అవ్వాల్సిందే! ఎందుకంటే డెల్‌ టెక్‌ టీమ్‌ తమ సిస్టమ్స్‌లో ఓ బగ్‌ను గుర్తించిందట. దీని వల్ల కంప్యూటర్‌లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం నేరగాళ్లకు చిక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

సైబర్‌ అటాకర్స్‌ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్‌ వేస్తూనే ఉంటారు. ప్రస్తుతం వారి చూపు డెల్‌ కంప్యూటర్ల మీద పడిందట. అందుకే మీ దగ్గర డెల్‌ ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ ఉంటే ఒకసారి చెక్‌ చేసుకోండి అంటున్నారు టెక్‌ నిపుణులు. జీ న్యూస్‌ కథనం ప్రకారం, డెల్‌ టెక్‌ టీమ్‌ తమ సిస్టమ్స్‌లో ఓ బగ్‌ను గుర్తించిందని, దాని వల్ల కంప్యూటర్‌లో యూజర్లు దాచుకున్న వ్యక్తిగత సమాచారం నేరగాళ్లకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ బగ్‌ ద్వారా హ్యాకర్‌ అతి సులభంగా నేరుగా సిస్టమ్స్‌లోని స్టోరేజీలోకి వెళ్లొచ్చట. డెల్‌ సిస్టమ్స్‌లో ఈ సమస్య ఉందని కొన్ని రోజుల కిందట సెంటినెల్‌ ల్యాబ్స్‌ బృందం బగ్‌ ఉందన్న విషయాన్ని బయటపెట్టింది.

దీని వల్ల సిస్టమ్స్‌పై వరుస సైబర్‌ అటాక్స్‌ జరిగే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. మొత్తం సిస్టమ్‌ హ్యాక్‌ జరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇదంతా డెల్‌ సిస్టమ్స్‌లో ప్రీ ఇన్స్టాల్డ్‌గా ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌ వల్లనే వస్తోందని సమాచారం. దీని వల్ల ఆ సిస్టమ్‌ అడ్మిన్ యాక్సెస్‌ను హ్యాకర్‌ పొందగలుగుతారు. దీంతో మాల్‌వేర్‌ను ఇన్ స్టాల్‌ చేసి అవసరమైన డేటాను తస్కరిస్తారు.

ఈ బగ్‌ పేరు డీబీయుటిల్‌ అని డెల్‌ కంపెనీ గుర్తించింది. ఇది సిస్టమ్‌కు బయాస్‌ అప్‌డేట్స్‌ను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇందులో రెండు మెమొరీని కరప్షన్ చేయగలవు. మరో రెండు ఇన్ పుట్‌ వ్యాలిడేషన్ ఫెయిల్యూర్స్‌. మరో ఒకటి లాజిక్‌కు సంబంధించింది. ఈ సమస్య 2009 నుంచి అందుబాటులో ఉన్న డెల్‌ డివైజెస్‌లో ఉంది. అంటే లక్షలకుపైగా సిస్టమ్స్‌లో ఈ సమస్య ఉంటుంది.

అయితే, సెంటినెల్‌ సమాచారం అందించగానే. దానిపై డెల్‌ ఓ అప్‌డేట్‌ కూడా రిలీజ్‌ చేసిందని సమాచారం. కాబట్టి ఈ మధ్య కాలంలో మీరు అప్‌డేట్‌ చేసుకోనివారు.. వెంటనే చేసుకోండి. మన దేశంలో ఈ అటాక్స్‌ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎండ్‌ పాయింట్‌ థ్రెట్‌రిపోర్టు ఇటీవల వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news