కరోనా మహమ్మారి కారణంగా చాలా మందిలో ఒత్తిడి పెరిగి పోయింది. దీంతో ఎంతో మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ మార్పులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గి నిద్రపడుతుంది. ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి ఇలా చేస్తే మంచిగా ఎనర్జీ గా ఉండొచ్చు.
వాస్తు దోషాల కారణంగా నిద్ర పట్టక పోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తు దోషాలు ఉంటే నిద్ర పట్టక పోవచ్చు. మంచం, బెడ్ రూమ్ కి సంబంధించి కొన్ని దోషాలు ఉంటాయి. వీటి వల్ల నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మీరు నిద్రపోలేక పోతుంటే ఈ వాస్తు పద్ధతుల్ని పాటించండి.
మంచం లో మార్పులు:
వాస్తు శాస్త్రం ప్రకారం మంచం ఎప్పుడూ కూడా చెక్కది మరియు అది దీర్ఘచతురస్రాకారము లో లేదా చతురస్రాకారంలో ఉండాలి. గుండ్రంగా ఉండే మంచం మీద ఎప్పుడూ పడుకోవద్దు.
ఐరన్ తో చేసిన మంచం మీద కూడా నిద్ర పోవడం మంచిది కాదు అని పండితులు అంటున్నారు. అలానే మంచం ఎక్కువ ఎత్తు ఉండకూడదు మరీ అంత తక్కువ ఎత్తు ఉండకూడదు.
ఈ దిక్కులో నిద్రపోండి:
ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు పాదాలు దక్షిణ వైపు ఉండేటట్లు చూసుకోండి ఇలా చేయడం వల్ల పీడకలలు, మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి.
ఒకవేళ కనుక మీరు పడమర వైపు పాదాలు పెట్టి నిద్ర పోతుంటే అప్పుడు మంచి జరగదు. ఒకవేళ మీరు ఉత్తర దిక్కుకి పాదాలు పెట్టి నిద్ర పోతుంటే అప్పుడు మీకు దానం మరియు అదృష్టం కలుగుతుంది.
అలానే నిద్రపోయేటపుడు మీ తల కింద చెప్పులు వంటివి ఉంచొద్దు వీటి వల్ల కూడా నెగటివ్ ఎనర్జీ వస్తుంది.