ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ పేమెంట్ లనే చేస్తున్నారు. యుపీఐ ద్వారా చాలా మంది రోజూ పేమెంట్స్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనం డబ్బులు తప్పుగా పంపే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ కనుక యూపీఐ ద్వారా మీరు ఎవరికైనా డబ్బుల్ని తప్పుగా పంపితే ఈ విధంగా చేయండి అప్పుడు మీ డబ్బులు తిరిగి మీరు మళ్ళీ వెనక్కి పొందొచ్చు.
డబ్బులు పంపాక మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. దాన్ని సేవ్ చేసుకోండి. యాప్ నుంచి డబ్బు పంపించిన వివరాలను స్క్రీన్ షాట్ తీసి ఉంచండి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి ఏ యాప్ నుంచి డబ్బు పంపించారో ఆ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించి సమస్యను చెప్పండి. లేదంటే మీరు ఎన్‌పీసీఐ పోర్టల్‌లో కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. npci.org.in వెబ్‌సైట్ లోకి వెళ్లి What We Do Tabలో యూపీఐ లో ఫిర్యాదు సెక్షన్‌లో కంప్లెంట్ చేయండి.
రాంగ్ పేమెంట్ గురించి మీరు మీ బ్యాంకులో కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇలా ఎలా కూడా మీ సమస్య కి పరిష్కారం లేదంటే Bankingombudsman.rbi.org.in వెబ్‌సైట్ లోకి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు వాపసు ఇచ్చేందుకు రిసీవర్ ఒప్పుకోకపోతే చట్టబద్ధంగా కూడా ఫిర్యాదు చేయవచ్చు.