ఏటీఎం కార్డ్ వాడటం లేదా…? అయితే ఈ పని చేయండి…!

-

బ్యాంకులు ఇప్పుడు ఖాతాదారుల భద్రతకు కీలక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రూల్స్ తో ఎప్పటికప్పుడు వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నాయి. ఇప్పుడు లాక్ డౌన్ నేపధ్యంలో కొన్ని కార్డులను ఖాతా దారులు ఆర్ధిక కష్టాలతో వాడటం లేదు. కార్డును వాడనప్పుడు స్విచ్చాఫ్ చేసే సదుపాయం ఖాతాదారులకు కల్పించాయి బ్యాంకులు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, ఆన్‌లైన్ షాపింగ్, ఏటీఎంలల్లో కార్డు వాడకుండా మీరు ఆఫ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్, ఆన్‌లైన్ షాపింగ్ లావాదేవీల్లో ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందరూ కార్డులను ఉపయోగించే అవకాశ౦ లేదు. కాబట్టి వాటిని ఆఫ్ చేసుకునే అవకాశాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంకు సూచనలు చేసింది. మీ కార్డును ఆన్‌లైన్ షాపింగ్‌కు ఉపయోగించనట్టైతే ఆఫ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్‌కు కూడా ఆఫ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

కొత్తగా జారీ చేసే లేదా రీప్లేస్ చేసే కార్డులు కేవలం మన దేశంలో ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్‌లో మాత్రమే వాడుకునేలా అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. కార్డును ఆన్‌లైన్ షాపింగ్‌, కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ యూసేజ్ కోసం వాడాలంటే యూజర్లే ఆ ఫీచర్లను ఆన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ లావాదేవీ లిమిట్ కూడా మీరే సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

కొన్ని బ్యాంకులు గతంలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల్లో ఈ విధమైన భద్రతా ఫీచర్లు ఇచ్చాయి. అంతర్జాతీయంగా లేదా ఆన్‌లైన్ షాపింగ్ కోసం కార్డు వాడకుండా ఆఫ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇప్పుడు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపధ్యంలో కార్డులు వాడకపోతే లాక్ డౌన్ సమయంలో కార్డులను బ్లాక్ చేసుకోవాలి. మీరు ఏ బ్యాంకు కార్డు వాడుతున్నారో ఆ బ్యాంకు వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో కార్డును స్విచ్చాఫ్, స్విచ్చాన్ చేసే ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news