‘దూస్రా’యాప్‌లో సమాచారం సురక్షితం..

-

ప్రస్తుత సమాజంలో నగదు కన్నా డిజిటల్‌ లావదేవీలే అధికమయ్యాయి. ఎక్కడికి వెళ్లిన డిజిటల్‌ లావా దేవీలు జరుపుతున్నారు. షాపింగ్‌ మాల్స్, రెస్టారెండ్లు, సూపర్‌ మార్కెట్లకు వెళ్లినప్పుడు బిల్లింగ్‌ చేసే క్రమంలో వారు ఫోన్‌ నంబర్‌ అడగం మనం ఇవ్వడం సాధరణంగా మారిపోయింది. ఎక్కడెక్కడి నుంచి ఫోన్‌ కాల్స్, మెసెజ్‌లు, లింకులు వస్తూనే ఉంటాయి. దీంతో వ్యక్తిగత భద్రతకు ప్రమాదమనే సందేహాలు తలెత్తుతూ భయాందోళనకు గురవుతుంటాము. వీటంనింటికి చెక్‌ పెట్టేందుకు సిమ్‌ లేకుండానే నంబర్‌ అందించే ‘దూస్రా’ అందుబాటులోకి వచ్చింది.చాలా మంది వారి వ్యక్తిగత నంబర్‌ కాకుండా కమ్యూనికేషన్‌ కోసమే ఎక్స్‌ట్రాగా ఓ సిమ్‌ తీసుకుంటారు. అందుకు నెలనెల ఎంతోకొంత రీచార్జ్‌ చేస్తుంటారు. దాన్ని నివారించేందుకు దూస్రా యాప్‌ చాలా ఉపయోగపడుతుందని దాని వ్యవస్థాపకుడు సీఈఓ ఆదిత్యవూచి పేర్కొన్నారు.

వర్చువల్‌ నంబర్‌గా..

పది అంకెలతో ఉండే వర్చువల్‌ నంబర్‌. ఇది కేవలం దూస్రాయాప్‌ ద్వారా మాత్రమే పని చేస్తోంది. దీన్ని సెకండ్‌ నంబర్‌గా కూడా వాడుకోచ్చంటున్నారు. రెస్టారెంట్లు, షాపింగ్‌ మాళ్లు, పలు సందర్భాల్లో కాంటాక్ట్‌ నంబర్‌ ఇవ్వాల్సి వచ్చినటప్పుడు దూస్రా నంబర్‌ ఇవ్వొచ్చు. ఆయా సంస్థలు, బయటి నుంచి వచ్చే కాల్స్, మెసెజ్‌లు, లింక్‌లను ఈ యాప్‌ బ్లాక్‌చేస్తోంది. ఈ నెంబర్‌కు వచ్చే కాల్స్‌ అన్నీ బ్లాక్‌ చేయడమే దీని ప్రత్యేకత.

చాలా సెఫ్టీ..

ప్రస్తుత సమాజాంలో మహిళల భద్రత సమస్య క్లిష్టంగా మారింది. మహిళలు, యువతులను వే«ధింస్తున్నా రాంగ్‌ చాటింగ్, మెసెజ్‌ను ఈ యాప్‌ ద్వారా కట్టడి చేయవచ్చు అంటున్నారు ఆదిత్య వూచి. మన పర్సనల్‌ నంబర్‌ను దూస్రాయాప్‌ ఎక్కడా చూపించదు. ఇందులో వాయిస్‌ మెయిల్‌ ట్రస్టెడ్‌ నంబర్‌ ఆప్షన్లు ఉంటాయి. వాయిస్‌ మెయిల్‌ ఆప్షన్‌లో గుర్తుతెలియని వారు కాల్‌ చేసినప్పుడు కాల్‌కు బదులుగా వాయిస్‌ మెయిల్‌ ఆప్షన్‌ సూచిస్తుంది. వాటిని మనం ఎప్పుడైన చేసుకోవచ్చు. అవసరమనుకుని కాల్‌ చేసినా మన నంబర్‌ వారికి కనబడదు.

Read more RELATED
Recommended to you

Latest news