ఫేస్‌బుక్ లోగో మారింది.. చూశారా..?

-

ప్రపంచ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్‌ నూతన లోగోను ఆవిష్కరించింది. ఫేస్‌బుక్‌ కు అనుబంధంగా ఉన్న పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫారాల నుంచి ఫేస్‌బుక్‌ మరింత స్పష్టతను కోరుకుంటోందని, యూజర్లకు కూడా సామాజిక మాధ్యమాలను గుర్తించడంలో సులువుగా ఉండాలన్న ఉద్దేశంతో లోగోను మార్చినట్టు ఫేస్‌బుక్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ ఆంటోనియో లూసియో వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఫేస్‌బుక్ అధీనంలో ఫేస్‌బుక్ యాప్, మెసింజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్స్‌ప్, వర్క్ ప్లేస్, ఓకులస్, పోర్టల్, కాలిబ్రా వంటి అనుబంధ యాప్స్ ఉన్నాయి. అలాగే ఫేస్‌బుక్ కొత్త వెబ్‌సైట్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news